ఆక‌ట్టుకుంటున్న 'స‌ర్కారు వారి పాట' కొత్త పోస్ట‌ర్‌

Mahesh looks dashing in Maha Shivaratri special poster of Sarkaru Vaari.సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు న‌టిస్తున్న తాజా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 March 2022 7:57 AM GMT
ఆక‌ట్టుకుంటున్న స‌ర్కారు వారి పాట కొత్త పోస్ట‌ర్‌

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు న‌టిస్తున్న తాజా చిత్రం 'స‌ర్కారు వారి పాట‌'. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మ‌హేశ్ స‌ర‌స‌న కీర్తి సురేష్ న‌టిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీయంబీ, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ పై ఈ చిత్రం నిర్మిత‌మ‌వుతోంది. ఈ సంక్రాంతికే ప్రేక్ష‌కుల ముందుకు రావాల్సి ఉన్నా.. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఆల‌స్య‌మ‌వుతూ వ‌స్తోంది. మే 12న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది.

ఈ చిత్రంలోని పాట‌ల‌ను ఒక్కొటిగా విడుద‌ల చేస్తోంది. కళావతి ఫస్ట్ సింగిల్‌ను విడుద‌ల చేయ‌గా అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా ఈ చిత్రం నుంచి కొత్త పోస్ట‌ర్ విడుద‌ల చేసింది చిత్ర‌బృందం. యాక్ష‌న్ సీక్వెన్స్‌లోని ఓ స్టిల్‌గా ఈ పోస్ట‌ర్ క‌నిపిస్తోంది. ప్ర‌త్య‌ర్థుల భ‌ర‌తం ప‌డుతున్న మ‌హేశ్ బాబు ఫైటింగ్ పోస్ట‌ర్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. మ‌హేశ్ మాస్ అరాచ‌కం అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. థ‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి.

Next Story