'సర్కారువారి పాట' @100 డేస్
Mahesh Babu's Sarkaru Vaari Paata completes 100 days.సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం
By తోట వంశీ కుమార్
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్, 14 రీల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. మే 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మిక్డ్స్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్లలో జోరు చూపించింది. మహేష్ బాబు క్యారెక్టరైజేషన్, సముద్రఖని విలనిజంతో పాటు థమన్ సంగీతం సినిమాని నిలబెట్టాయి. మహేష్ కెరీర్‌లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది.
100 DAYS for the Sensational Blockbuster #SarkaruVaariPaata 🔥
— #BlockbusterSVP 💯 (@SVPTheFilm) August 19, 2022
Super🌟 @urstrulyMahesh at his absolute best on the Big Screens ❤️🔥#100DaysOfBlockbusterSVP@KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @MythriOfficial @GMBents @14ReelsPlus pic.twitter.com/qNcrewuMIC
నేటితో ఈ చిత్రం విడుదలై 100 రోజులైంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట, విశాఖ జిల్లా గోపాలపట్నంలో రోజుకి 4 ఆటలతో ప్రదర్శితమవుతూ వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది. 'సరిలేరు నీకెవ్వరు' తర్వాత దాదాపు రెండున్నరేళ్ళకు విడుదలైన ఈ చిత్రం మహేష్ బాబు అభిమానులకు పుల్ మీల్స్ అందించింది. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.