ఇందిరాదేవి మృతిపై చిరంజీవి ఎమోషనల్‌ ట్వీట్

Mahesh Babu’s mother passed away condolences pour in.కృష్ణ స‌తీమ‌ణి, మ‌హేష్‌ త‌ల్లి ఇందిరాదేవి క‌న్నుమూశారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Sept 2022 9:45 AM IST
ఇందిరాదేవి మృతిపై చిరంజీవి ఎమోషనల్‌ ట్వీట్

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఇంట తీవ్ర విషాదం నెల‌కొంది. సూప‌ర్ స్టార్ కృష్ణ స‌తీమ‌ణి, మ‌హేష్‌ త‌ల్లి ఇందిరాదేవి అనారోగ్యంతో బుధ‌వారం ఉద‌యం క‌న్నుమూశారు. ఆమె మ‌ర‌ణం ప‌ట్ల సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా వేదిక‌గా సంతాపం ప్ర‌క‌టిస్తున్నారు. మ‌హేష్ కుటుంబానికి భ‌గ‌వంతుడు మ‌నోధైర్యం ప్ర‌సాదించాల‌ని ప్రార్థిస్తున్నారు.

మెగాస్టార్‌ చిరంజీవి ఇందిరాదేవి మృతిపై ఎమోషనల్‌ ట్వీట్‌ చేశారు. "శ్రీమతి ఇందిరాదేవి గారు స్వర్గస్తులయ్యారు అనే వార్త ఎంతో కలచివేసింది. ఆ మాతృదేవత ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ, సూపర్‌ స్టార్‌ కృష్ణ గారికి, సోదరుడు మహేష్‌బాబుకి, కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను" అంటూ ట్వీట్‌ చేశారు.







Next Story