సితార ఫస్ట్ యాడ్ రెమ్య్మూనరేషన్ ఏం చేసిందో తెలుసా?
మహేష్ బాబు, నమ్రత దంపతుల కుమార్తె సితార ఘట్టమనేని.. తన మొదటి వాణిజ్య ప్రకటన నుండి వచ్చిన వేతనాన్ని స్వచ్ఛంద సంస్థకు అందించినట్లు తెలిపారు.
By అంజి Published on 16 July 2023 7:21 AM ISTసితార ఫస్ట్ యాడ్ రెమ్య్మూనరేషన్ ఏం చేసిందో తెలుసా?
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత దంపతుల కుమార్తె సితార ఘట్టమనేని.. తన మొదటి వాణిజ్య ప్రకటన నుండి వచ్చిన వేతనాన్ని స్వచ్ఛంద సంస్థకు అందించినట్లు తెలిపారు. తను నటించిన నగల బ్రాండ్ కోసం 'ప్రిన్సెస్' అనే షార్ట్ ఫిల్మ్ ప్రివ్యూతో పాటు, సితార తన తల్లి నమ్రత ఘట్టమనేనితో కలిసి హైదరాబాద్‌లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో తన పేరు మీద ఉన్న కలెక్షన్‌కి సంబంధించిన లుక్ బుక్‌ను లాంచ్ చేసింది. ఇటీవల ప్రముఖ జ్యువలరీ యాడ్‌లో నటించగా అందుకు సంబంధించిన ఫోటోలు ప్రసిద్ద న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ బిల్‌బోర్డ్‌పై ప్రదర్శితమయ్యాయి. సితార సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ యూట్యూబ్‌లో వీడియోలో అప్‌లోడ్ చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంది.
తను చేసే డ్యాన్స్‌కు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సితార ఈ యాడ్‌లో నటించినందుకు కోటి రూపాయలు పారితోషికం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ తనకు వచ్చిన పారితోషికాన్ని పూర్తిగా ఓ ఛారిటీకి ఇస్తున్నట్టు సితార తెలిపింది. తాజాగా సితార మీడియాతో ముచ్చటించారు. జ్యువెలరీ సంస్థ యాడ్‌లో చేయడం సంతోషంగా ఉందని తెలిపిన సితార.. యాడ్ షూట్ మొత్తం చాలా సరదాగా సాగిందని, ప్రతి ఒక్కరు తనకు సపోర్టు చేసినట్లు చెప్పింది.
తనకు సినిమాలు చూడడమంటే ఇష్టమని, అందులో నటించేందుకు చాలా ఆసక్తి ఉందని, తన తల్లి నుంచి తనపై నమ్మకం పెంచుకున్నానని చెప్పింది. న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్‌లో ప్రారంభించిన సిగ్నేచర్ జ్యువెలరీ కలెక్షన్‌ను చూసి తన తండ్రి చాలా సంతోషించాడని, మొదట అడ్వర్టైజింగ్ వీడియో చూసి భావోద్వేగానికి గురయ్యానని ఆమె చెప్పారు. నమ్రత.. అదే సమయంలో తమ కుమారుడు గౌతమ్ సినిమాల్లోకి రావచ్చని, అయితే ప్రస్తుతం తన ఉన్నత చదువులలో నిమగ్నమై ఉన్నాడని పేర్కొంది.
నా ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎవరికి ఇచ్చానంటే! - సూపర్ స్టార్ మహేశ్ బాబు కూతురు సితార ఘట్టమనేని#Sitaraghattamaneni #Sitara #MaheshBabu #Namratha #NTVTelugu #NTVENT pic.twitter.com/sc839MsUpN
— NTV Telugu (@NtvTeluguLive) July 15, 2023