న‌మ్ర‌త‌కు మ‌హేష్ స్పెష‌ల్ విషెస్‌.. ట్వీట్ వైర‌ల్‌

Mahesh Babu wishes wife Namrata on her birthday. మ‌హేష్ త‌న శ్రీమ‌తి న‌మ్ర‌త‌కు బర్త్డే స్పెష‌ల్ విషెస్.. ట్వీట్ వైర‌ల్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Jan 2021 9:31 AM IST
Mahesh Babu wishes wife Namrata on her birthday

ప్రతి మగాడి విజయం వెనక ఓ ఆడది ఉంటుందనేది పెద్దల మాట. మహేష్‌ బాబు- నమ్రతా శిరోద్కర్‌ జంటను చూస్తే.. అది నిజ‌మ‌ని అనిపిస్తుంది. నమ్రత వృత్తి పరంగా, వ్యక్తి గతంగా మహేష్‌కు ప్రోత్సాహం అందిస్తుంది. వాళ్లిద్దరు ఎంత అన్యోన్యంగా ఉంటారో సామాజిక మాధ్యమాల్లో పంచుకునే ఫొటోలు చూస్తే అర్థమవుతుంది. 'వంశీ' చిత్రంలో కలిసి నటించిన వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. స‌మ‌యం దొరికితే మ‌హేష్.. కుటుంబంతో గ‌డిపేందుకే ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తాడు. కాగా.. నేడు ఆయ‌న శ్రీమ‌తి న‌మ్ర‌త పుట్టిన రోజు.

1972 జ‌న‌వ‌రి 22న న‌మ్ర‌త జ‌న్మించింది. నేడు ఆమె 49వ వ‌సంతంలోకి అడుగుపెడుతోంది. ఈ సంద‌ర్భంగా ప‌లువురు ప్రముఖులు, అభిమానులు ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. ఇదిలా ఉంటే.. భ‌ర్త‌ అయితే త‌న శ్రీమ‌తికి స్పెష‌ల్ విషెస్ అందించారు. 'ఈ రోజు నేను ఎంతో ప్రేమించే వ్య‌క్తి పుట్టిన రోజు. ప్ర‌తి రోజు నీతో గ‌డ‌ప‌డం నాకు ప్ర‌త్యేకం. కాని ఈ రోజు మ‌రింత ప్ర‌త్యేకంం. అద్భుత‌మైన స్త్రీతో అంద‌మైన రోజు.. ప్రేమ‌తో పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు లేడీ బాస్ అంటూ ' మ‌హేష్ ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ వైర‌ల్‌గా మారింది. న‌మ‌త్ర పుట్టిన రోజు వేడుక‌ల‌ను దుబాయ్‌లో ప్లాన్ చేసిన మ‌హేష్.. అందుకు త‌గ్గ‌ట్లుగానే గురువారం ఫ్యామితో క‌లిసి అక్క‌డికి చేరుకున్నారు.


నమ్రత 1993 లో మిస్ ఇండియాగా ఎంపికైంది. ఆ తర్వాత పలు హిందీ సినిమాలతో పాటు తెలుగులో కూడా నటించింది. ఇక తెలుగులో మహేష్ సరసన వంశీ చిత్రంలో నటించిన నమ్రత.. మహేష్‌‌తో ప్రేమలో పడి అతన్నేపెళ్లిచేసుకుంది. వీరి వివాహం 2005 ఫిబ్రవరిలో జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు గౌతమ్ కృష్ణ, సితార. పెళ్లి త‌రువాత సినిమాకు గుడ్‌బాయ్ చెప్పింది.


Next Story