తండ్రి పుట్టిన రోజున మ‌హేష్‌ ఎమోష‌న్ పోస్ట్‌

Mahesh Babu wishes to krishna.తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో త‌న‌దైన ముద్ర వేశారు సూప‌ర్ స్టార్ కృష్ణ‌. తెలుగు సినిమా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  31 May 2021 9:17 AM IST
తండ్రి పుట్టిన రోజున మ‌హేష్‌ ఎమోష‌న్ పోస్ట్‌

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో త‌న‌దైన ముద్ర వేశారు సూప‌ర్ స్టార్ కృష్ణ‌. తెలుగు సినిమా ప్ర‌స్తానాన్ని ఆయ‌న పేరు లేకుండా పూర్తి చేయ‌లేము. ఆయ‌న న‌టించిన ఎన్నో చిత్రాలు ఇప్ప‌టి వారి ఆద‌ర్శం. ఈ రోజు(మే 31) సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. 78 పుట్టిన రోజు జ‌రుపుకుంటున్న ఆయ‌న‌కు సినీ ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌ముఖులతో పాటు ఆయ‌న అభిమానులు సోష‌ల్ మీడియా వేదిక‌గా పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. ఇక సూప‌ర్ స్టార్ త‌న‌యుడు ప్రిన్స్ మ‌హేష్ బాబు త‌న తండ్రికి ప్రేమ‌తో కూడిన శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

తండ్రి కృష్ణ‌తో దిగిన ఫొటోను పోస్ట్ చేస్తూ..' జన్మదిన శుభాకాంక్షలు నాన్న. నాకు ఎప్పుడూ ఉన్నతమైన దారినే చూపిస్తున్న మీకు థాంక్స్ తెలియజేస్తున్నాను. మీకు తెలిసిన దానికంటే ఎక్కువే నా ప్రేమ మీ మీద ఉంటుంది' అని మ‌హేష్ ట్వీట్ చేశారు.

ఇదిలా ఉంటే.. ప్ర‌తి సంవ‌త్స‌రం త‌న తండ్రి పుట్టిన రోజు నాడు మ‌హేష్ త‌న సినిమాల‌కు సంబంధించిన అప్‌డేట్స్ ఇస్తూ ఉంటారు. అయితే.. ఈ సారి క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఎలాంటి అప్‌డేట్ ఇవ్వ‌డం లేద‌ని చెప్పారు. కాగా.. మ‌హేష్ ప్ర‌స్తుతం స‌ర్కార్ వారి పాట చిత్రంలో న‌టిస్తున్నారు. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్‌.. క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డింది.


Next Story