ఆచార్య‌కు మ‌హేష్ మాట సాయం.. చిరంజీవి ట్వీట్ వైర‌ల్‌

Mahesh Babu voice over to Acharya movie.మెగాస్టార్​ చిరంజీవి న‌టించిన తాజా చిత్రం 'ఆచార్య'. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 April 2022 10:54 AM IST
ఆచార్య‌కు మ‌హేష్ మాట సాయం.. చిరంజీవి ట్వీట్ వైర‌ల్‌

మెగాస్టార్​ చిరంజీవి న‌టించిన తాజా చిత్రం 'ఆచార్య'. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టించారు. చిరు స‌ర‌స‌న కాజ‌ల్‌, చ‌ర‌ణ్ కు జ‌త‌గా పూజా హెగ్డే న‌టించిన ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, కొణిదెల ప్రొడెక్ష‌న్స్ బ్యాన‌ర్స్‌పై నిరంజ‌న్ రెడ్డి, రామ్‌చ‌ర‌ణ్‌లు నిర్మిస్తున్నారు. మ‌ణిశ‌ర్మ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ఈ నెల 29న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

ఇప్ప‌టికే చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. కాగా.. ఈ చిత్రానికి సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు వాయిస్ ఓవ‌ర్ అందించ‌నున్నారు అనే వార్త చ‌క్క‌ర్లు కొట్ట‌గా.. దీనిపై చిత్ర‌బృందం క్లారిటీ ఇచ్చింది. అది నిజ‌మేనంటూ చెప్పేసింది. ఈ మేర‌కు ఈ రోజు సోష‌ల్ మీడియాలో అధికారికంగా ప్ర‌క‌టించేసింది.

ఇక త‌న చిత్రానికి మ‌హేష్ వాయిస్ ఓవ‌ర్ ఇవ్వ‌డంపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. 'డియ‌ర్ మ‌హేష్‌.. ఆచార్య లోని పాద‌ఘ‌ట్టాన్ని నీ వాయిస్ ఓవ‌ర్‌తో అంద‌రికీ ప‌రిచ‌యం చేయ‌నున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది. ఎంతో ప్ర‌త్యేక‌మైన విధంగా ఈ చిత్రంలో నువ్వు కూడా భాగ‌మైనందుకు ధ‌న్య‌వాదాలు. నీ వాయిస్ విని నేనూ, చ‌ర‌ణ్ ఎంత‌లా థ్రిల్ అయ్యామో.. అదే విధంగా అభిమానులు, ప్రేక్ష‌కులు కూడా సంతోషిస్తారు' అని చిరంజీవి ట్వీట్ చేశారు.


Next Story