బుల‍్లితెరపై మహేశ్-ఎన్టీఆర్ సందడి.. ఇక పూనకాలే
Mahesh Babu special episode from EMK.బుల్లి తెరపై ప్రసారమౌతున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోకు యంగ్ టైగర్ ఎన్టీఆర్
By తోట వంశీ కుమార్ Published on
20 Nov 2021 9:50 AM GMT

బుల్లి తెరపై ప్రసారమౌతున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తారక్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమం మంచి టీఆర్‌పీ రేటింగ్‌తో దూసుకుపోతుంది. ఇక కార్యక్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు పాల్గొన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు రాగా.. తాజాగా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. మధ్య తరగతి వారి కలలను నిజం చేయడంతో పాటు వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రారంభమైన ఈ షోలో తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు సందడి చేశారు.
తారక్ అడిగిన ప్రశ్నలకు మహేష్ మంచి హుషారుగా సమాధానాలు చెప్పారు. ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. పూర్తి ఎపిసోడ్ త్వరలోనే ప్రసారం కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ జెమినీ టీవీ ఛానల్ పూనకాల ఎపిసోడ్ లోడింగ్ అని అంటూ పోస్టర్‌ని షేర్ చేసింది. దీనిపై నెటీజన్లు కూడా వెయింటింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మహేష్ బాబు ఈ స్పెషల్ ఎపిసోడ్‌లో 25 లక్షలు గెలుచుకున్నట్టు తెలుస్తోంది.
Next Story