సూపర్‌స్టార్ మహేష్ బాబును గర్వపడేలా చేసిన గౌతమ్
Mahesh Babu son Gautam create a record in swimming.సూపర్ స్టార్ మహేష్ బాబు-నమత్రా శిరోద్కర్ దంపతుల కుమారుడు
By తోట వంశీ కుమార్ Published on 17 Jun 2021 5:08 PM ISTసూపర్ స్టార్ మహేష్ బాబు-నమత్రా శిరోద్కర్ దంపతుల కుమారుడు గౌతమ్ క్రీడారంగంలో సత్తా చాటుతున్నాడు. తన వయో విభాగంలో తెలంగాణలోని టాప్-8 స్విమ్మర్లలో ఒకడిగా నిలిచాడు. ఈ విషయాన్ని గౌతమ్ తల్లి నమత్రా శిరోద్కర్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. గౌతమ్ తమను గర్వించేలా చేస్తున్నాడని పుత్రోత్సాహం ప్రదర్శించారు. 2018 నుంచి స్విమ్మింగ్ లో ప్రావీణ్యం కనబరుస్తున్నాడని, రాష్ట్రస్థాయిలో ప్రతిభావంతుడైన స్విమ్మర్ గా ఎదిగాడని వివరించారు. స్విమ్మింగ్ లో సహజసిద్ధంగా నైపుణ్యం సంపాదించడమే గాక, క్రీడలో కఠోరంగా శ్రమించడాన్ని ఆస్వాదిస్తున్నాడని తెలిపారు. గౌతమ్ 3 గంటల్లో 5 కి.మీ దూరాన్ని ఈదగలడని.. బటర్ ప్లై, బ్యాక్ స్ట్రోక్, బ్రెస్ట్ స్ట్రోక్, ఫ్రీ స్టైల్ అనే నాలుగు పద్దతుల్లో ఈత కొడతాడని తెలిపారు.
ఇక ఈ పోస్ట్ చూసిన మహేష్ అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. తండ్రికి తగ్గ తనయుడు అంటూ పొగుడుతూ తమ అభిమానాన్ని చాటుతున్నారు. 1 నేనొక్కడినే చిత్రంతో వెండి తెరకు పరిచయమయ్యాడు గౌతమ్. మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో మహేష్ చిన్నప్పటి పాత్రలో గౌతమ్ నటించాడు. ఇదిలా ఉంటే.. మహేష్ ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రెండవ షెడ్యూల్ షూటింగ్ కొంతవరకు జరిగింది. అయితే కోవిడ్ వల్ల షూటింగ్ వాయిదా పడింది.