సరిలేరు నీకెవ్వరు.. ఒక్కరోజులో 30 మంది చిన్నారుల జీవితాల్లో వెలుగు
Mahesh Babu saves the lives of 30 children.సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ హీరో నే అని
By తోట వంశీ కుమార్ Published on 8 April 2022 7:01 AM GMTసూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ హీరో నే అని అనిపించుకుంటున్నాడు. ఎంతో మంది చిన్నారుల జీవితాల్లో వెలుగులను నింపుతున్నాడు. పబ్లిసిటీని పెద్దగా ఇష్టపడని మహేష్.. గుండె జబ్బులతో బాధపడే చిన్నారులకు మహేష్.. ఎంబీ ఫౌండేషన్ ద్వారా ఆపరేషన్లు చేయిస్తున్న సంగతి తెలిసిందే. ఇక నిన్న ఒక రోజే 30 మంది చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్స్, మహేష్ బాబు ఫౌండేషన్ వైద్యుల సహకారంతో 30 మంది చిన్నారులకు గుండె శస్త్రచికిత్సలు చేయించారు.
ఈ విషయాన్ని మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ మంచి పనికి సపోర్ట్ ను అందించినందుకు ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్‌కు ఆస్పత్రి వారికి ధన్యవాదాలు తెలియజేశారు. దాతృత్వ కార్యక్రమానికి సంబంధించిన కొన్ని చిత్రాలను నమత్ర తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మహేశ్ చేసిన ఈ పనులపై అతడి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో మహేష్‌ను పొగుడుతూ పోస్టులు పెడుతున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. 'సరిలేరు నీకెవ్వరూ' తర్వాత మహేశ్ నటిస్తున్న చిత్రం 'సర్కారు వారి పాట'. పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మహేష్ సరసన కీర్తి సురేశ్ నటిస్తోంది. జీఎండీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ ప్లస్‌తో పాటు మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.