యాంకర్ సుమ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'జయమ్మ పంచాయితీ'. విజయ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, టీజర్లకు మంచి స్పందన వచ్చింది. మే 6 ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయించగా.. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా మరో ట్రైలర్‌ను విడుదల చేయించారు.
కామెడీ డ్రామాతో పాటు భావోద్వేగాలు ఉండేలా ట్రైలర్‌ని కట్ చేశారు మేకర్స్. ట్రైలర్‌లో ఏముందంటే... పిల్ల ఫంక్షన్ చేసి వచ్చిన డబ్బులతో భర్తకు ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటుంది జయమ్మ. అది జరగదు.దీంతో తీవ్ర నిరాశకు లోనవుతుంది. ఎలాగైన భర్తకు ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటుంది. అదే సమయంలో గ్రామంలోని ఓ యువకుడు తన కూతురితో సరసాలాడడానికి ప్రయత్నిస్తాడు. అతని నుంచి కూతురిని కాపాడుకుందా? జయమ్మ పెట్టిన పంచాయితీ ఏంటి? దాని వల్ల గ్రామ పెద్దలకు ఎదురైన సమస్యలు ఏంటి? తెలియాలంటే మే 6న థియేటర్స్‌లో 'జయమ్మ పంచాయితీ' చూడాల్సిందే.