మోకాలి నొప్పితో ఇబ్బంది పడుతున్న మహేష్‌బాబు.. సర్జరీ కోసం అమెరికాకు..!
Mahesh Babu likely to undergo knee surgery.సూపర్ స్టార్ మహేష్‌బాబు ఆరోగ్యానికి సంబంధించిన ఓ వార్త నిన్నటి నుంచి
By తోట వంశీ కుమార్ Published on 2 Dec 2021 9:59 AM ISTసూపర్ స్టార్ మహేష్‌బాబు ఆరోగ్యానికి సంబంధించిన ఓ వార్త నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. మహేష్ మోకాలికి సర్జరీ నిమిత్తం అమెరికాకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న చిత్రం 'సర్కారు వారి పాట'. పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. కాగా.. ఈ చిత్ర షూటింగ్‌లో మహేష్ మోకాలికి చిన్న గాయం అయింది. దీంతో గత కొద్ది రోజులుగా ఆయన తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నారట.
ఈ విషయమై డాక్టర్లను సంప్రదించగా.. మోకాలికి సర్జరీ అవసరం అని చెప్పడంతో మహేష్‌బాబు సర్జరీ కోసం అమెరికాకు వెళ్లనున్నట్లు వినిపిస్తోంది. సర్జరీ అనంతరం రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారట. దీంతో 'సర్కారు వారి పాట' సినిమా షూటింగ్ కు మరో రెండు నెలల బ్రేక్ పడనుంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం 'ఆర్ఆర్ఆర్(రౌద్రం, రణం, రుధిరం)' కారణంగా ఏప్రిల్‌కు వాయిదా పడిన సంగతి తెలిసిందే.
కాగా.. 2014 నుంచి మహేష్ మోకాలికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. వరుసగా సినిమాలతో బిజీగా ఉండడంతో.. అప్పటి నుంచి ఆయన సర్జరీని చేయించుకోలేకపోయారట. ఇప్పుడు ఆయన తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నారట. దీంతో సాధ్యమైనంత త్వరగా సర్జరీ చేయించుకోవాలని నిర్ణయానికి వచ్చారట. ఇక మహేష్ గాయం గురించి తెలిసిన ఆయన అభిమానులు.. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. సోషల్ మీడియాలో #getwellsoonmaheshbabuanna అనే హాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతుంది. ఆయన నటిస్తున్న చిత్రం 'సర్కారు వారి పాట' సినిమా 2022 ఏప్రిల్ 1న విడుదల కానుంది.