కాస్త లేట్ అయిన లేటెస్ట్‌గా.. 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్‌పై మ‌హేష్‌బాబు స్పంద‌న‌ ఇదే

Mahesh Babu heaps praise over RRR trailer.ద‌ర్శ‌క‌దీరుడు రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న చిత్రం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Dec 2021 1:52 PM IST
కాస్త లేట్ అయిన లేటెస్ట్‌గా.. ఆర్ఆర్ఆర్ ట్రైలర్‌పై మ‌హేష్‌బాబు స్పంద‌న‌ ఇదే

ద‌ర్శ‌క‌దీరుడు రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్ (రౌద్రం, ర‌ణం, రుధిరం)'. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇక సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలోనే చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా నిన్న ఈ చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసింది. ఈ ట్రైల‌ర్‌ను చూసిన ప్ర‌తి ఒక్క‌రు అద్భుతం, తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ స్థాయిని మ‌రో మెట్టుపై నిలిపే సినిమా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

కాస్త లేట్ అయినా లేటెస్ట్‌గా స్పందించారు సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు. 'ట్రైలర్‌ లోని ప్రతి షాట్ అద్భుతంగా ఉంది. మైండ్ బ్లోయింగ్!! మాస్టర్ స్టోరీ టెల్లర్ తిరిగి వచ్చాడు. ట్రైలర్ అంతా గూస్‌బంప్స్!!' అంటూ ట్వీట్ చేశారు మ‌హేష్.

పీరియాడిక‌ల్ మూవీగా దాపు రూ.450కోట్ల భారీ బ‌డ్జెట్‌తో డీవీవీ దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.అల్లూరి సీతారామరాజుగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్ గా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌నిపించ‌నున్నారు. ఆలియా భట్, అజయ్ దేవగణ్, ఓలివియా మోరీస్, శ్రీయ శరణ్, సముద్రఖని ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈచిత్రానికి కీర‌వాణి సంగీతాన్ని అందిస్తున్నారు.

Next Story