టెలివిజన్ లో సందడి చేయనున్న గుంటూరు కారం

‘సూపర్ స్టార్’ మహేష్ బాబు యాక్షన్ డ్రామా చిత్రం గుంటూరు కారం (2024) బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది.

By Medi Samrat  Published on  18 March 2024 8:45 PM IST
టెలివిజన్ లో సందడి చేయనున్న గుంటూరు కారం

‘సూపర్ స్టార్’ మహేష్ బాబు యాక్షన్ డ్రామా చిత్రం గుంటూరు కారం (2024) బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమాకు మొదట డిజాస్టర్ టాక్ వచ్చింది. అయితే ఆ తర్వాత ఈ సినిమా నిలబడింది. ఫ్యామిలీ ఆడియన్స్ గుంటూరు కారం సినిమాను బాగా ఆదరించారు. సినిమా పండగ హాలిడేస్ పూర్తయ్యాక కూడా మంచి ప్రదర్శన కనబరిచింది. పండుగ సీజన్ కావడం.. కుటుంబ కంటెంట్ ఉన్న సినిమా కావడంతో ప్రేక్షకులను థియేటర్‌లకు రప్పించడంలో మహేష్ బాబు సక్సెస్ అయ్యాడు. ఇది మహేష్ బాబు బాక్సాఫీస్ స్టామినాని చాటి చెప్పింది.

థియేటర్ రన్ పూర్తయ్యాక గుంటూరు కారం సినిమా దేశంలోని ఐదు ప్రధాన భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో టెలీకాస్ట్ అయింది. స్ట్రీమింగ్ సమయంలో ప్రేక్షకుల నుండి పాజిటివ్ స్పందనను అందుకుంది. ఇది తమిళం, హిందీ ప్రేక్షకులకు కూడా బాగా కనెక్ట్ అయింది. త్రివిక్రమ్ బెస్ట్ వర్క్ అని చెప్పకపోయినా.. సినిమా చెత్తగా అయితే లేదని చాలా మంది ఓటీటీలో చూశాక చెప్పారు. ఇప్పుడు ఈ సినిమా TV ప్రేక్షకులకు దగ్గర కాబోతోంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఉగాది పండుగ సందర్భంగా జెమినీ టీవీలో గ్రాండ్ ప్రీమియర్‌ను ప్రదర్శించడానికి సిద్ధంగా ఉంది. ఇక టీవీలో చూశాక ఇంకెలాంటి రెస్పాన్స్ వస్తుందో!!

Next Story