వేదికపై మహేష్‌బాబు డ్యాన్స్.. వీడియో వైరల్
Mahesh Babu dance at Sarkaru Vaari Paata movie success meet.సాధారణంగా హీరోలందరూ సినిమాల్లో అద్భుతంగా డ్యాన్సులు
By తోట వంశీ కుమార్ Published on 17 May 2022 11:29 AM ISTసాధారణంగా హీరోలందరూ సినిమాల్లో అద్భుతంగా డ్యాన్సులు చేసినా.. ఆడియో ఫంక్షన్లు, విజయోత్సవ సభల్లో స్టేజ్‌లపై డ్యాన్సులు చేయడం చాలా అరుదనే చెప్పాలి. కార్యక్రమ వ్యాఖ్యాత పట్టుబడితేనో, అభిమానులు కోరితేనే తప్పక చేస్తుంటారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్‌బాబు స్టేజ్ పైన డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళితే.. సూపర్ స్టార్ మహేష్ భాబు నటించిన తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. ఇటీవలే విడుదలైన ఈచిత్రం సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోవడంతో పాటు థియేటర్ల వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్రం సోమవారం రాత్రి కర్నూలలోని ఎస్‌టీబీసీ కాలేజీ మైదానంలో విజయోత్సవ సభను ఏర్పాటు చేశారు. దీనికి పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు.
ఈకార్యక్రమంలో మహేష్ బాబు మాట్లాడుతూ.. 'ఒక్కడు సినిమా అప్పుడు కర్నూలుకు వచ్చాను. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత వచ్చాను. మా వాళ్ళు కర్నూల్ లో ఈ ప్రోగ్రాం పెడతాము అంటే వెంటనే ఓకే చెప్పాము.ఈ సినిమా సక్సెస్ చేసిన నా అభిమానులందరికి రుణపడి ఉంటాను. ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో ఇలాంటి అభిమానులు నాకు దొరికారు' అని అన్నారు.
ఈ కార్యక్రమంలో అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. 'మ మ మహేశ' పాటకు డ్యాన్సర్లు పెర్ఫామ్ చేస్తుండగా.. సంగీత దర్శకుడు తమన్ వెళ్లి కాలు కదిపారు. ఈ ఉత్సాహభరిత వాతావరణాన్ని చూసిన మహేష్ బాబు తనసీట్లో కూర్చోలేకపోయారు. తనే స్వయంగా స్టేజ్‌పైకి ఎక్కి స్టెప్పులేశారు. దీంతో అభిమానులు కేరింతలు, విజిల్స్ తో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది.