ద‌స‌రా బ‌రిలో 'మ‌హాస‌ముద్రం'

Mahasamudram Release on October 14th.ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Aug 2021 1:51 PM IST
ద‌స‌రా బ‌రిలో మ‌హాస‌ముద్రం

'ఆర్ఎక్స్ 100' ఫేమ్ అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం 'మ‌హాస‌ముద్రం'. యంగ్ హీరో శ‌ర్వానంద్- సిద్దార్థ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. దాదాపు ఏడు సంవ‌త్స‌రాలు త‌రువాత సిద్దార్ టాలీవుడ్‌లోకి ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తుండ‌డంతో.. అభిమానుల్లో ఈ చిత్రంపై మంచి అంచ‌నాలే ఉన్నాయి. అపురూప‌మైన ప్రేమ‌క‌థ‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో అదితిరావు హైద‌రీ, అను ఇమ్మాన్యుయేల్ లు హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. రావు రమేశ్‌, జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇప్ప‌టికే పూర్తి అయ్యింది. ప్ర‌స్తుతం పోస్టు ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది.

ఇప్ప‌టికే విడుద‌లైన ప్ర‌చార చిత్రాల‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకం పై రామ‌బ్ర‌హ్మం ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా.. చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా.. ఈ చిత్ర విడుద‌ల తేదీని చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 14న ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు వెల్ల‌డించింది. మ‌రీ ద‌స‌రా బ‌రిలో మిగ‌తా చిత్రాల పోటిని త‌ట్టుకుని ఈ చిత్రం నిల‌బ‌డుతుందో లేదో చూడాలి.

Next Story