మెగా హీరోల మ‌ధ్య‌లో శ‌ర్వానంద్‌..

Maha samudram movie release date announced.యంగ్‌ హీరో శర్వానంద్ 'బొమ్మరిల్లు ఫేమ్ సిద్ధార్థ్ కలిసి నటిస్తున్న చిత్రం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Jan 2021 12:04 PM IST
మెగా హీరోల మ‌ధ్య‌లో శ‌ర్వానంద్‌..

యంగ్‌ హీరో శర్వానంద్ 'బొమ్మరిల్లు ఫేమ్ సిద్ధార్థ్ కలిసి నటిస్తున్న చిత్రం 'మ‌హాస‌ముద్రం'. ఆర్ఎక్స్ 100 ద‌ర్శ‌కుడు రెండేళ్ల గ్యాప్ త‌రువాత ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మించనున్నారు. ఈ చిత్రంలో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ల‌వ్ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈచిత్రం తెర‌కెక్కుతోంది. తాజాగా ఈ చిత్ర విడుద‌ల తేదీని ప్ర‌క‌టించారు చిత్ర‌బృందం.


తెలుగు, త‌మిళం భాష‌ల్లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం ఆగ‌స్ట్ 19న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఓ పోస్టర్ ని వదిలారు. ఇందులో శర్వానంద్, సిద్దార్థ్ ఇద్దరూ ఓ బోట్ పై కూర్చొని సిగరెట్ తాగుతూ కనిపిస్తున్నారు. చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా.. రాజ్ తోటా సినిమాటోగ్రాఫర్ గా వ్య‌వ‌హిస్తున్నారు. ఈ చిత్రంతోనే దాదాపు ఏడేళ్ల త‌రువాత తెలుగులో సిద్దార్థ క‌నిపించ‌నున్నాడు. దీపావ‌ళి సంద‌ర్భంగా విడుదలైన ఈ చిత్ర థీమ్ పోస్టర్ విశేష స్పందన తెచ్చుకోవడమే కాకుండా సినిమాపై ఆసక్తిని పెంచేసేసింది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రం విడుద‌ల‌కి వారం ముందు అల్లుఅర్జున్ న‌టిస్తున్న 'పుష్ప' విడుద‌ల అవుతుండ‌గా.. వారం త‌రువాత వెంకీ, వ‌రుణ్‌తేజ్ న‌టిస్తున్న 'ఎఫ్ 3' విడుద‌ల కానుంది.




Next Story