సూపర్‌ స్టార్‌ క్రేజ్.. 'జైలర్‌' రిలీజ్‌ రోజు ఆ ఉద్యోగులకు సెలవు!

తమిళ్‌లో రజినీకి ఉన్న క్రేజ్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు ఫ్యాన్స్ కాదు భక్తులు ఉంటారు.

By అంజి  Published on  7 Aug 2023 1:15 PM IST
holiday, rajinikanths, jailer movie, Jailer Movie Release date

సూపర్‌ స్టార్‌ క్రేజ్.. 'జైలర్‌' రిలీజ్‌ రోజు ఆ ఉద్యోగులకు సెలవు!

తమిళ్‌లో రజినీకి ఉన్న క్రేజ్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు ఫ్యాన్స్ కాదు భక్తులు ఉంటారు. రజినీ నుంచి మూవీ వస్తోందంటే అభిమానులకు పండగే. సూపర్‌ స్టార్‌ అనే పేరు తెరపై కనిపిస్తే చాలు ఈలలు గోలలతో థియేటర్‌లు దద్దరిల్లిపోవాల్సిందే. ఇక రజనీ స్క్రీన్‌ మీద కనబడితే అభిమానులు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఆయన సినిమా రిలీజ్‌ అవుతుందంటే చాలా మంది హిట్‌ కావాలని పూజలు చేపిస్తుంటారు. ప్రస్తుతం రజనీకాంత్‌ నటించిన 'జైలర్‌' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఆగస్టు 10న రిలీజ్‌ కాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఎప్పటి నుంచో సాలిడ్‌ హిట్‌ కోసం ఎదురు చూస్తున్న రజనీకి ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ అవుతుందని ఫ్యాన్స్‌ ధీమాతో ఉన్నారు.

తాజాగా ఈ సినిమా త్వరలోనే విడుదల సందర్భంగా యూనో ఆక్వా కేర్ అనే కంపెనీ ఆగస్టు 10న హాలీడే ప్రకటించింది. కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులందరికి ఉచితంగా మూవీ టిక్కెట్‌లు ఇవ్వనుంది. దీన్ని బట్టి చూస్తే రజనీ క్రేజ్‌ ఇప్పటికీ ఏ మాత్రం తగ్గలేదని తెలుస్తుంది. చెన్నై, బెంగళూరు, తిరుచ్చి, తిరునల్వేలి, చెంగల్‌పట్టు, మట్టుతావని, అరపాళ్యం, అలగప్పన్ నగర్ బ్రాంచ్‌లకు సెలవు ప్రకటించబోతున్నట్లు ఆ సంస్థ తెలిపింది. దీనికి సంబంధించిన సర్క్యులర్ ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. కాగా ‘వరుణ్ డాక్టర్’, ‘బీస్ట్’ చిత్రాల దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా చేస్తుంది. ఇప్పటికే రిలీజైన టీజర్‌, ట్రైలర్‌లు భారీ అంచనాలు క్రియేట్‌ చేశాయి.

Next Story