బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె మాతృమూర్తి స్నేహలతా దీక్షిత్ ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఆమె వయస్సు 91 సంవత్సరాలు. ఆమె మరణానికి గల కారణాలు తెలియరాలేదు. అయితే.. వయో సంబంధిత సమస్యలతోనే ఆమె తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. ఈ రోజు మధ్యాహ్నాం 3 గంటలకు వర్లీ శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు.
ఇక మాధురీ దీక్షిత్‌కు తన తల్లి అంటే ఎంతగానో ఇష్టం. తన కెరీర్ ఎదుగుదలలో తన తల్లి పాత్ర ఎంతో ఉందని పలు ఇంటర్య్వూలో మాధురి చెప్పింది. జూన్ 2022లో తన తల్లికి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో మాధురి ఇలా రాసుకొచ్చింది. "పుట్టినరోజు శుభాకాంక్షలు, ఆయ్! తల్లిని కూతురితో స్నేహం చేస్తున్నానని వారు చెబుతారు. వారు మరింత సరైనవారు కాలేరు. మీరు నా కోసం చేసిన ప్రతిదాని నుండి, మీరు నేర్పిన పాఠాలు ఉన్నాయి. మీ నుండి నాకు లభించిన అతిపెద్ద బహుమతి. నేను మీకు మంచి ఆరోగ్యం మరియు ఆనందాన్ని మాత్రమే కోరుకుంటున్నాను.