ప్రభాస్ 'సలార్' విలన్ ఎవరో తెలుసా.?
Madhu Guruswamy is the villain in Prabhas and Prashanth Neel's Salaar. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో సాలార్ అనే మూవీ నటిస్తున్నాడు.
By Medi Samrat Published on 7 Feb 2021 2:37 PM ISTప్రభాస్ ఈశ్వర్ చిత్రం తో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమైనా విషయం తెలిసిందే. తరువాత అంతగా విజయాలు సాధించకపోయినప్పటికీ రాజమౌళి దర్శకత్వలో వచ్చిన ఛత్రపతి సినిమా తో మంచి సక్సెస్ సాధించి ఖాతా తెరిచాడు. ఆ తరువాత కొరటాల శివ దర్శకత్వం వహించిన మిర్చి సినిమా తో ప్రభాస్ మాస్ హీరోగా ఎదిగాడు. ఇక రాజమౌళి రూపొందించిన బాహుబలి సిరీస్ తో జాతీయ స్థాయిలో ప్రేక్షకాదరణ పొందాడు. బాహుబలి 2 తర్వాత సుజిత్ దర్శకత్వంలో 'సాహెూ' చిత్రంలో నటించాడు. ఈ చిత్రం పెద్దగా సక్సెస్ మాత్రం సాధించలేకపోయింది.
బాలీవుడ్ లో మాత్రం కాస్త పరవాలేదు అనిపించింది. ఇక కన్నడ రాక్ స్టార్ యష్ హీరోగా 'కేజీఎఫ్' తో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ చిత్రం సీక్వెల్ రాబోతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో సాలార్ అనే మూవీ నటిస్తున్నాడు. ఇందులో చాలా మంది బిగ్గెస్ట్ స్టార్స్ నటిస్తున్నారు అని సమాచారం. అయితే ఈ సినిమాలో విలన్ గా విజయ్ సేతుపతి నటిస్తున్నాడని ఇటీవల వార్తలు గుప్పుమన్నాయి.. కానీ వాటికీ చెక్ పెడుతూ కన్నడ స్టార్ మధు గురుస్వామి ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమాలో విలన్‌గా చేయనున్నాడు అని సమాచారం.
ఈ విషయాన్నీ అతడే తన సోషల్ మీడియా ఖాతా లో తెలిపాడు. కన్నడలో భారీ హిట్ అందుకున్న వజ్రకాయ, భజరంగీ సినిమాల్లో విలన్‌గా కనిపించాడు. 'నేను తరువాత సలార్ వెంచర్‌లో చేస్తున్నాను. ఇందులో భాగం కావడం ఎంతో సంతోషంగా ఉంద'ని మధు సోషల్ మీడియాలో స్వయంగా తెలిపారు. మధు కెరీర్‌లో ఇదే భారీ బడ్జెట్ సినిమా ఇదే. కాకపోతే ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.