ప్రమాదానికి కారణమిదే.. మాదాపూర్ ఏసీపీ
Madhapur ACP says Bike skid due to mud on road.హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడగా.. ప్రస్తుతం అపోలో
By తోట వంశీ కుమార్ Published on
11 Sep 2021 2:49 AM GMT

హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడగా.. ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. కాగా.. ఈ ప్రమాదం గురించి మాదాపూర్ ఏసీపీ స్పందించారు. నిన్న రాత్రి తీగల వంతెన వైపు నుంచి ఐకియా వైపు వెలుతుండగా.. రోడ్డుపై ఇసుక ఉండడం వల్ల బైక్ స్కిడ్ అయ్యిందని తెలిపారు. ఆ సమయంలో సాయిధరమ్‌తేజ్ వాహనాన్ని అదుపుచేయలేకపోయారన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో తేజ్ హెల్మెట్ పెట్టుకున్నాడని చెప్పారు. మద్యం సేవించలేదన్నారు. ప్రస్తుతం సాయి ఆరోగ్యం నిలకడగా ఉందని.. డాక్టర్లు చికిత్స అందిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు.
హెల్త్ బులిటెన్ విడుదల..
రోడ్డు ప్రమాదంలో గాయపడిన తేజ్‌కు ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అపోలో ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. కాలర్ బోన్ విరిగిందని తెలిపారు. శరీరంలో అంతర్గత గాయాలు ఏమీ కాలేదన్నారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని.. మరో 48 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని చెప్పారు.
Next Story