మాచర్ల నియోజకవర్గం.. ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Macherla Niyojakavargam OTT streaming date Fix.యంగ్ హీరో నితిన్‌ న‌టించిన తాజా చిత్రం మాచర్ల నియోజకవర్గం.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Nov 2022 9:31 AM IST
మాచర్ల నియోజకవర్గం.. ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

జ‌యాప‌జయాల‌తో సంబంధం లేకుండా వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ అభిమానుల‌ను అల‌రిస్తున్నాడు యంగ్ హీరో నితిన్‌. ఆయ‌న న‌టించిన తాజా చిత్రం మాచర్ల నియోజకవర్గం. ప్ర‌ముఖ ఎడిట‌ర్ రాజ‌శేఖ‌ర్‌ రెడ్డి ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యారు. తెలుగు అమ్మాయి అంజ‌లి స్పెష‌ల్ సాంగ్ లో క‌నిపించిన ఈ చిత్రంలో కృతిశెట్టి క‌థానాయిక‌. . రాజ్ కుమార్ ఆకెళ్ళ సమర్పణ లో శ్రేష్ట్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. కేథిరిన్ థ్రెసా కీల‌క పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రం ఆగ‌స్టు 12న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకుంది.

ఈ చిత్ర ఓటీటీ హ‌క్కుల‌కు జీ-5 సంస్థ ద‌క్కించుకుంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వ‌స్తుందా అని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో జీ-5 సంస్థ అభిమానుల‌కు శుభ‌వార్త అందించింది. డిసెంబ‌ర్ 9 నుంచి ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో ఓట్వీట్ చేసింది. థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను అంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోయిన ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి స్పంద‌న తెచ్చుకుంటుందో చూడాలి. ఎందుకంటే ఇటీవ‌ల కొన్ని చిత్రాలు థియేట‌ర్ల‌లో ఆడ‌క‌పోయినా ఓటీటీలో స‌త్తా చాటాయి.

Next Story