సీఎం జగన్‌తో మంచు విష్ణు భేటీ
MAA President Manchu Vishnu Meets AP CM YS Jagan.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను సినీ హీరో
By తోట వంశీ కుమార్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను సినీ హీరో, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్షుడు మంచు విష్ణు కలిశారు. ఈ రోజు(మంగళవారం) తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంచు విష్ణు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. సినీ రంగ సమస్యలపై జగన్‌తో మంచు విష్ణు చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఇటీవలే చిరంజీవి నేతృత్వంలో పలువురు సినీ పెద్దలు సీఎం జగన్‌ను కలిసిన సంగతి తెలిసిందే. అనంతరం వారు మాట్లాడుతూ.. సమస్యలు పరిష్కారం అయ్యాయని, ఈనెల చివరి నాటికి ప్రభుత్వం శుభవార్త చెప్పే అవకాశం ఉందని చెప్పిన సంగతి తెలిసిందే.
అయితే.. ఈ భేటికి మంచు ఫ్యామిలీకి ఆహ్వానం అందకపోవడంతో వారు కొంచెం అసహనం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. తరువాత మంత్రి పేర్ని నాని.. మోహన్ బాబు ఇంటికి వెళ్లి మాట్లాడం.. ఆ విషయంపై మంచు విష్ణు ట్వీట్, తర్వాత సవరణ ట్వీట్.. ఇలా ఒకదానివెంట మరోకటి ఇంట్రెస్టింగ్ పరిణామాలు జరుగుతూ వచ్చాయి. తమకు ఆహ్వానం అందలేదని మంచు ఫ్యామిలీ అసహనం వ్యక్తం చేసినట్లు జగన్ కి చెప్పడంతో ఆయన ఈరోజు మంచు విష్ణును కలవడానికి అపాయింట్ మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. లంచ్ మీట్ లో విష్ణు.. జగన్ ని కలిసారు. దీంతో భేటీ అనంతరం మంచు విష్ణు ఏం చెబుతారోననే ఆసక్తి నెలకొంది.