'మా' ఎన్నిక‌లు.. ప్ర‌కాశ్‌రాజ్ ప్యానెల్ స‌భ్యులు వీళ్లే

MAA Elections row Prakashraj panel list is out.టాలీవుడ్‌లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) అధ్య‌క్ష ఎన్నిక‌లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Jun 2021 11:06 AM GMT
మా ఎన్నిక‌లు.. ప్ర‌కాశ్‌రాజ్ ప్యానెల్ స‌భ్యులు వీళ్లే

టాలీవుడ్‌లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) అధ్య‌క్ష ఎన్నిక‌లు ఇప్పుడు హాట్ టాఫిక్‌గా మారాయి. ఈ సారి జ‌రుగ‌నున్న మా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ప్ర‌కాశ్‌రాజ్‌, మంచు విష్ణు, జీవితా రాజ‌శేఖ‌ర్‌, హేమ పోటీ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ ప‌డుతున్న ప్ర‌కాశ్ రాజ్ మ‌రో అడుగు ముందుకేశారు. త‌న ప్యానెల్ స‌భ్యుల వివ‌రాల‌ను ప్ర‌క‌టించారు. మొత్తం 27 మందితో కూడిన జాబితాను విడుద‌ల చేశారు.

ఈ సంద‌ర్బంగా ప్ర‌కాశ్ రాజ్ మాట్లాడుతూ..త్వ‌ర‌లో జ‌రుగ‌బోయే ఎన్నిక‌ల కోసం 'మా' శ్రేయ‌స్సు దృష్ట్యా..'మా' ప్ర‌తిష్ట కోసం నిర్మాణాత్మ‌క ఆలోచ‌న‌ల‌ను ఆచ‌ర‌ణ‌లో పెట్టే దిశ‌గా మ‌న న‌టీన‌టుల క్షేమం కోసం 'మా' టీంతో రాబోతున్న విష‌యాన్ని మీకు తెలియ‌జేస్తున్నా. పద‌వుల కోసం పోటీ చేయ‌డం లేదు. కేవ‌లం ప‌నులు చేసేందుకు మాత్ర‌మే పోటీలో ఉంటున్న‌ట్టు స్ప‌ష్టం చేశారు ప్ర‌కాశ్‌రాజ్‌.

ప్ర‌కాశ్ రాజ్ ప్యానెల్ జాబితా..

1.ప్ర‌కాశ్‌రాజ్‌, 2.జ‌య‌సుధ‌, 3.శ్రీకాంత్, 4.బెన‌ర్జీ, 5.సాయికుమార్, 6.త‌నీష్, 7.ప్ర‌గ‌తి, 8.అన‌సూయ‌, 9.స‌న‌, 10.అనితా చౌద‌రి, 11.సుధ‌, 12.అజ‌య్, 13.నాగినీడు, 14.బ్ర‌హ్మాజీ, 15.ర‌విప్ర‌కాశ్, 16.స‌మీర్‌, 17.ఉత్తేజ్‌, 18.బండ్ల గ‌ణేశ్‌, 19.ఏడిద శ్రీరామ్‌, 20.శివారెడ్డి, 21.భూపాల్, 22.టార్జాన్‌, 23.సురేశ్ కొండేటి, 24.ఖ‌య్యూమ్‌, 25.సుడిగాలి సుధీర్‌, 26.గోవింద‌రావు, 27.శ్రీధ‌ర్ రావు ఈ ప్యానెల్‌లో ఉన్నారు.

Next Story
Share it