'మా బావ మ‌నోభావాలు'.. ఊరమాస్‌ స్టెప్స్‌తో బాలయ్య రచ్చ

Maa Bava Manobhavalu song released from veera simha reddy movie.బాల‌కృష్ణ న‌టిస్తున్న చిత్రం 'వీర సంహారెడ్డి'.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Dec 2022 3:51 PM IST
మా బావ మ‌నోభావాలు.. ఊరమాస్‌ స్టెప్స్‌తో బాలయ్య రచ్చ

నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ న‌టిస్తున్న చిత్రం 'వీర సంహారెడ్డి'. గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బాల‌య్య స‌ర‌స‌న శ్రుతిహాస‌న్ న‌టిస్తోంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జన‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలోనే చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది.

ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌లైన టీజ‌ర్‌, పాట‌లు సినిమాపై అంచ‌నాలు అమాంతం పెంచేయ‌గా తాజాగా మూడో పాట‌ను చిత్ర బృందం విడుద‌ల చేసింది. 'మా బావ మనోభావాలు' అంటూ ఈ పాట సాగుతోంది. రామజోగయ్య శాస్త్రీ సాహిత్యం అందించ‌గా సాహితి చాగంటి, యామిని, రేణు కుమార్‌లు పాడారు. ఈ పాట‌లో బాల‌య్య ఊర‌మాస్ స్టెప్పుల‌తో అల‌రించాడు. ఈ వ‌య‌స్సుల్లో కూడా అలాంటి స్టెప్పులు వేయ‌డం ఒక్క బాల‌య్యే సొంతం అనేలా వీర లెవ‌ల్‌లో రెచ్చిపోయాడు. కొది సేప‌టి క్రిత‌మే విడుద‌లైన ఈ పాట యూట్యూబ్‌లో దూసుకుపోతుంది.

Next Story