చిత్ర నిర్మాణ సంస్థ 'లైకా ప్రొడక్షన్స్'ను మూసివేయబోతున్నారా?

తమిళ చిత్ర పరిశ్రమలో పెద్ద నిర్మాణ సంస్థల్లో లైకా సంస్థ కూడా ఒకటి. ఇళయదళపతి విజయ్ హీరోగా 'కత్తి' సినిమాతో లైకా ప్రొడక్షన్స్ కోలీవుడ్ లోకి అడుగుపెట్టింది.

By అంజి  Published on  16 March 2025 1:45 PM IST
Lyca Productions, Shut Down, Kollywood

చిత్ర నిర్మాణ సంస్థ 'లైకా ప్రొడక్షన్స్'ను మూసివేయబోతున్నారా? 

తమిళ చిత్ర పరిశ్రమలో పెద్ద నిర్మాణ సంస్థల్లో లైకా సంస్థ కూడా ఒకటి. ఇళయదళపతి విజయ్ హీరోగా 'కత్తి' సినిమాతో లైకా ప్రొడక్షన్స్ కోలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఈ బ్యానర్ ఎన్నో పెద్ద సినిమాలు నిర్మించింది. కానీ చాలా వరకు పరాజయాలు చవిచూశాయి. అయితే ఓ షాకింగ్ వార్త తమిళ చిత్ర పరిశ్రమను షేక్ చేస్తోంది. 'కత్తి' లాంటి పెద్ద బ్లాక్ బస్టర్ తర్వాత, ఆ నిర్మాణ సంస్థ చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంది. చాలా నష్టాలతో అట్టడుగు స్థాయికి చేరుకుంది. లైకా ప్రొడక్షన్స్ చంద్రముఖి 2, మిషన్: చాప్టర్ వన్, ఇండియన్ 2, లాల్ సలాం, వెట్టయ్యన్, విదాముయార్చి సినిమాలు తీసింది. అయితే ఈ అన్ని సినిమాలు బ్యానర్ కు భారీ నష్టాలను మిగిల్చాయి.

రజనీకాంత్, శంకర్ చిత్రాలతో నిర్మాణ సంస్థ భారీ మొత్తాలను కోల్పోయింది. 2.0, దర్బార్, లాల్ సలాం, వెట్టైయన్, ఇండియన్ 2 చిత్రాలు వారికి భారీ నష్టాలను తెచ్చిపెట్టాయి. ఇటీవల విడుదల అయిన అజిత్ విదాముయార్చి కూడా కోట్ల రూపాయల భారీ నష్టాన్ని తెచ్చిపెట్టింది. వరుసగా భారీ పరాజయాలతో, లైకా ప్రొడక్షన్స్ మూతపడుతుందని చెబుతున్నారు. ఇటీవల, లైకా బృందం మోహన్ లాల్ నటించిన ఎంపురాన్ సినిమా నుండి పెట్టుబడి పెట్టిన డబ్బు తీసుకొని బయటకు వచ్చేసింది. గోకులం మూవీస్ సంస్థ లైకా స్థానాన్ని భర్తీ చేసింది. దీన్ని బట్టి చూస్తుంటే లైకా సంస్థ దారుణమైన పరాజయాలను మూటగట్టుకుని నిర్మాణం నుండి బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Next Story