ఫైనాన్షియల్ ఫ్రాడ్ కేసులో బాలీవుడ్ నటుడు సోనూసూద్‌పై లూథియానా కోర్టు అరెస్ట్ వారెంట్ చేసింది. ముంబై అంధేరి వెస్ట్‌లోని ఓషివారా పోలీసులు సోనూ సూద్‌ను అరెస్టు చేసి తమ ముందు హాజరుపరచాలని జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ రామన్‌ప్రీత్ కౌర్ ఆదేశించారు. మోహిత్ శుక్లా అనే వ్యక్తిపై లూథియానాకు చెందిన న్యాయవాది రాజేష్ ఖన్నా దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు తెరపైకి వచ్చింది. మోసపూరిత క్రిప్టోకరెన్సీ పథకంలో తనను రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టేలా తప్పుదారి పట్టించారని ఖన్నా ఆరోపించారు.
ఈ ఫిర్యాదులో శుక్లా ఆర్థిక మోసానికి పాల్పడ్డాడని, ఈ విషయంలో సోను సూద్ ప్రమేయం గురించిన ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ కేసులో సోనూ సూద్ సాక్షిగా ఉన్నారని సదరు న్యాయ మూర్తి తెలిపాడు. కోర్టులో పదే పదే హాజరు కాకపోవడం చట్టపరమైన చర్యలలో భాగంగా, కోర్టు సోను సూద్‌ను సాక్ష్యం చెప్పమని సమన్లు జారీ చేసింది. అయితే, ఈ సమన్లకు ఆయన స్పందించడంలో విఫలమయ్యారని, ఇది అరెస్ట్ వారెంట్ జారీకి దారితీసిందని ఆరోపించారు. ఈ కేసులో తదుపరి విచారణ ఫిబ్రవరి 10న జరగనుంది. కోర్టు ఆదేశం ఆధారంగా చట్టం అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది.