ఆకట్టుకుంటున్న'లవ్ స్టోరీ' ట్రైలర్

Love Story Theatrical Trailer Out.అక్కినేని నాగ‌చైత్య‌న న‌టిస్తున్న తాజా చిత్రం 'ల‌వ్‌స్టోరి'. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Sep 2021 5:53 AM GMT
ఆకట్టుకుంటున్నలవ్ స్టోరీ ట్రైలర్

అక్కినేని నాగ‌చైత్య‌న న‌టిస్తున్న తాజా చిత్రం 'ల‌వ్‌స్టోరి'. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈచిత్రంలో చైతు స‌ర‌స‌న సాయి ప‌ల్ల‌వి న‌టిస్తోంది. కాగా.. ఈ చిత్రం ఎప్పుడో విడుద‌ల కావాల్సి ఉన్న‌ప్ప‌టికి క‌రోనా సెకండ్ వేవ్ కార‌ణంగా వాయిదా ప‌డింది. వినాయ‌క చ‌వితికి వ‌స్తుంద‌ని ప్ర‌కటించ‌గా.. ప‌లు కార‌ణాల వ‌ల‌న వాయిదా ప‌డింది. ఇటీవ‌లే ఈ చిత్ర విడుద‌ల తేదీని చిత్ర బృందం విడుద‌ల చేసింది. ఈనెల 24న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్లు వెల్ల‌డించింది.

ఈ నేప‌థ్యంలోనే చిత్ర‌బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌, పోస్ట‌ర్స్‌, రిలిక‌ల్ సాంగ్స్ ఈ చిత్రంపై ఉన్న అంచ‌నాల‌ను పెంచేసింది. తాజాగా ఈ చిత్ర ట్రైల‌ర్ ను విడుద‌ల చేశారు. నాగ‌చైత‌న్య చెప్పె డైలాగ్‌లు ఆక‌ట్టుకుంటున్నాయి. ఓ అంద‌మైన ప్రేమ‌క‌థా చిత్రంగా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ట్రైల‌ర్ వైర‌ల్‌గా మారింది. ఇంకెందుకు మీరు ఓసారి ట్రైల‌ర్‌పై లుక్కేయండి

Next Story
Share it