లవ్‌స్టోరి మూవీ.. థియేట్రికల్ ట్రైలర్‌కు డేట్ ఫిక్స్
Love Story theatrical trailer on September 13th.అక్కినేని నాగచైత్యన నటిస్తున్న తాజా చిత్రం లవ్‌స్టోరి. శేఖర్
By తోట వంశీ కుమార్ Published on 12 Sept 2021 12:59 PM ISTఅక్కినేని నాగచైత్యన నటిస్తున్న తాజా చిత్రం 'లవ్‌స్టోరి'. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రంలో చైతు సరసన సాయి పల్లవి నటిస్తోంది. కాగా.. ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నప్పటికి కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. వినాయక చవితికి వస్తుందని ప్రకటించగా.. పలు కారణాల వలన వాయిదా పడింది. ఇటీవలే ఈ చిత్ర విడుదల తేదీని చిత్ర బృందం విడుదల చేసింది. ఈనెల 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వెల్లడించింది.
ఈ నేపథ్యంలోనే చిత్రబృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్, రిలికల్ సాంగ్స్ ఈ చిత్రంపై ఉన్న అంచనాలను పెంచేసింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను సెప్టెంబర్ 13న ఉదయం 11.07 లకు విడుదల చేయనున్నట్లు హీరో నాగచైతన్య తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మరీ ట్రైలర్ ఎలా ఉంటుందోనని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Theatrical Trailer of Revanth and Mounica's #LoveStory on Sep 13th at 11:07am
— chaitanya akkineni (@chay_akkineni) September 12, 2021
Stay Tuned! #LoveStoryFromSep24th
@Sai_Pallavi92 @sekharkammula @pawanch19 @SVCLLP #amigoscreations @AsianSuniel @adityamusic @NiharikaGajula @GskMedia_Pr pic.twitter.com/zrZ93a4dU2
శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్ పతాకాలపై కె. నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.