శేఖ‌ర్ క‌మ్ముల 'ల‌వ్ స్టోరీ రిలీజ్ డేట్ ఫిక్స్

Love Story releasing in theatres on sep 10th.శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో నాగ చైత‌న్య న‌టిస్తున్న చిత్రం ల‌వ్‌స్టోరి. ఈ చిత్ర

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Aug 2021 7:11 AM GMT
శేఖ‌ర్ క‌మ్ముల ల‌వ్ స్టోరీ రిలీజ్ డేట్ ఫిక్స్

శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో నాగ చైత‌న్య న‌టిస్తున్న చిత్రం ల‌వ్‌స్టోరి. ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడో పూర్తి అయ్యింది. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఈ చిత్ర విడుద‌ల వాయిదా పడింది. ఈ చిత్రం ఓటీటీలో విడుద‌ల అవుతుందా..? లేక థియేట‌ర్ల‌లోనా విడుద‌ల అవుతుందా..? అన్న సందేహాల‌కు చిత్ర బృందం తెర‌దించింది. ఈ చిత్రాన్ని థియేట‌ర్ల‌లోనే విడుద‌ల చేస్తున్న‌ట్లు సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించింది. అంతేకాదండోయ్ ఈ చిత్రాన్ని ఎప్పుడు విడుద‌ల చేస్తామ‌నే విష‌యాన్ని సైతం వెల్ల‌డించింది.

ఇక ఈ చిత్రాన్ని వినాయ‌క చ‌వితి కానుక‌గా సెప్టెంబ‌ర్ 10న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువస్తున్న‌ట్లు చెప్పింది. ఈ చిత్రంలో నాగ చైత‌న్య స‌ర‌స‌న సాయి ప‌ల్ల‌వి న‌టించింది. ఈచిత్రంలోని 'సారంగదరియా' పాట జ‌నాల‌ను ఊర్రూత‌లు ఊగించింది. సాయిపల్లవి డ్యాన్స్ మూవ్ మెంట్స్ మ‌రోసారి అల‌రించాయి. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన ప్ర‌చార చిత్రాలు కూడా మూవీపై అంచనాల‌ను రెట్టింపు చేసింది. శ్రీవెంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ఎల్‌పి సంస్థ నిర్మించింది. ఏప్రిల్‌లో విడుద‌ల కావాల్సిన ఈ చిత్రం క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డింది.

Next Story