'ల‌వ్ స్టోరీ' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్‌

Love Story OTT Release Date fix.అక్కినేని నాగ‌చైత‌న్య‌. సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన చిత్రం ల‌వ్‌స్టోరి. శేఖ‌ర్ క‌మ్ముల

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Oct 2021 8:29 AM GMT
ల‌వ్ స్టోరీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్‌

అక్కినేని నాగ‌చైత‌న్య‌. సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన చిత్రం 'ల‌వ్‌స్టోరి'. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం గ‌త నెల‌లో విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజ‌యాన్ని సొంతం చేసుకుంది. క‌రోనా సెకండ్ వేవ్ త‌రుపున ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌లో విడుద‌లైన అతి పెద్ద సినిమా ఇదే. చైతు, ప‌ల్లవిల జంట‌కు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న కులవివక్షత, అమ్మాయిల పట్ల ప్రస్తుతం జరుగుతున్న సంఘటన నేపథ్యంలో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకోవ‌డంతో భారీ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ విడుద‌ల‌కు సిద్దంగా ఉంది.

అక్టోబ‌ర్ 22న సాయంత్రం 6 గంట‌ల నుంచి ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ లో స్ట్రీమింగ్ కానుంద‌ని చిత్ర బృందం తెలిపింది. విడుద‌ల తేదీని ప్ర‌క‌టిస్తూ స‌రికొత్త ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసింది. ఈ ట్రైల‌ర్ ఆద్యంతం ఆక‌ట్టుకునేలా ఉంది.

Next Story
Share it