'టైటిల్‌ మార్చండి'.. ఆ సినిమా మేకర్స్‌కి ఎల్‌ఐసీ నోటీసులు

ప్రదీప్ రంగనాథ్, కృతి శెట్టి జంటగా నటించిన, దర్శకుడు విఘ్నేష్ శివన్ రూపొందించిన ప్రాజెక్ట్ ఎల్‌ఐసీ (లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) చిక్కుల్లో పడింది.

By అంజి  Published on  7 Jan 2024 2:15 PM IST
Love Insurance Corporation,  LIC film, Kollywood, Vignesh Shivan

'టైటిల్‌ మార్చండి'.. ఆ సినిమా మేకర్స్‌కి ఎల్‌ఐసీ నోటీసులు

ప్రదీప్ రంగనాథ్, కృతి శెట్టి జంటగా నటించిన, దర్శకుడు విఘ్నేష్ శివన్ రూపొందించిన ప్రాజెక్ట్ ఎల్‌ఐసీ (లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) చిక్కుల్లో పడింది. ఎల్‌ఐసీ సంస్థ చిత్రయూనిట్‌కు నోటీసులు జారీ చేసింది. విఘ్నేష్ శివన్, సెవెన్ స్క్రీన్ స్టూడియోతో సహా చిత్ర నిర్మాతలకు నోటీసులు పంపింది. తమ సంస్థకు ప్రజల్లో మంచి పేరు ఉందని, మూవీ కోసం ఈ టైటిల్‌ను వాడితే సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగే ఛాన్స్‌ ఉందని పేర్కొంది. టైటిల్‌ను ఉపయోగించడం పట్ల ఎల్‌ఐసీ సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది. వారం రోజుల్లోగా పేరు మార్చకపోతే లీగల్‌, క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

త ఏడాది డిసెంబర్‌లో ప్రారంభమైన ఈ చిత్రంలో ఎస్‌జె సూర్య ముఖ్యమైన పాత్రలో కనిచనున్నారు. ఈ సినిమాలో ప్రదీప్, కృతి మొదటిసారిగా కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాను సెవెన్ స్క్రీన్ స్టూడియో, రౌడీ పిక్చర్స్ తీస్తున్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చారు, యోగి బాబు హాస్య పాత్రలో నటిస్తున్నారు. చిత్ర సాంకేతిక బృందంలో సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్, ఎడిటర్ ప్రదీప్ రాఘవ్ ఉన్నారు.ప్రస్తుతానికి, మేకర్స్ నోటీసుకు స్పందించలేదు. సినిమా టైటిల్ చుట్టూ ఉన్న ఈ కాపీరైట్ సమస్యను వారు ఎలా పరిష్కరిస్తారో చూడాలి.

Next Story