స‌ర్‌ప్రైజ్..నెల‌రోజులు కాకుండానే ఓటీటీలో 'లైగ‌ర్' వ‌చ్చేసింది

Liger Streaming Now On OTT Platform.విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం లైగ‌ర్‌.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Sep 2022 3:04 AM GMT
స‌ర్‌ప్రైజ్..నెల‌రోజులు కాకుండానే ఓటీటీలో లైగ‌ర్ వ‌చ్చేసింది

టాలీవుడ్ యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం 'లైగ‌ర్‌'. బాక్సింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈచిత్రంలో విజ‌య్ స‌ర‌స‌న బాలీవుడ్ ముద్దుగుమ్మ అన‌న్యా పాండే న‌టించింది. లెజెండరీ బాక్సర్‌ మైక్ టైసన్, సీనియర్‌ నటి రమ్యకృష్ణ కీలకపాత్రల్లో కనిపించారు. భారీ అంచ‌నాల మ‌ధ్య ఆగ‌స్టు 25న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అయితే.. ఆశించిన స్థాయిలో విజ‌యాన్ని అందుకోలేక పోయింది.

ఈ క్ర‌మంలో ఓటీటీలో ఎప్పుడు వ‌స్తుందా..? అని ఆస‌క్తిగా నెటీజ‌న్లు ఎదురుచూస్తున్నారు. వారంద‌రికి డిస్నీ+హాట్‌స్టార్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చింది. గురువారం(సెప్టెంబ‌ర్ 22) నుంచి తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ మ‌ల‌యాళ బాష‌ల్లో లైగ‌ర్‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. గ‌త రెండు రోజులుగా ఈ విష‌య‌మైన సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నా.. డిస్నీ+హాట్‌స్టార్ ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. చిన్న ట్వీట్‌తో స‌డెన్‌గా స్ట్రీమింగ్‌కు తీసుకువచ్చి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద ప‌రాజ‌యాన్ని చ‌విచూసినా.. ఓటీటీలో మాత్రం అదర‌గొట్టాయి. మరీ లైగర్ చిత్రానికి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.

Next Story
Share it