లైగ‌ర్ రిలీజ్ తేదీ ఫిక్స్.. భార‌త్‌..మేము వ‌చ్చేస్తున్నాం

LIGER Release Date Fixed.విజ‌య్ దేవ‌రకొండ హీరోగా సెన్సెషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం లైగ‌ర్ రిలీజ్ తేదీ ఫిక్స్.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Feb 2021 10:08 AM IST
LIGER Release Date

విజ‌య్ దేవ‌రకొండ హీరోగా సెన్సెషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం 'లైగ‌ర్‌'. 'సాలా క్రాస్ బ్రీడ్' అనేది ఉప శీర్షిక‌. ఈ చిత్రంలో విజ‌య్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే న‌టిస్తోంది. యాక్షన్ అండ్ ఎంటర్టైన్‌మెంట్‌ కథాంశంతో తెరకెక్కుతోంది. విజయ్ ఫైటర్‌గా క‌నిపించనున్న‌ ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా చిత్ర బృందం విడుద‌ల తేదీని ప్ర‌క‌టించింది. సెప్టెంబ‌ర్ 9న లైగ‌ర్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. పాన్ ఇండియా చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా తెలుగు, త‌మిళం, క‌న్న‌డ, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో విడుద‌ల కానుంది.


చిత్ర విడుద‌ల తేదీని తెలియ‌జేస్తూ.. హీరో విజ‌య్‌దేవ‌ర‌కొండ సోష‌ల్ మీడియాలో కొత్త పోస్ట‌ర్‌ను అభిమానుల‌తో పంచుకున్నాడు. తేదీ ఫిక్స్ చేస్తున్నాం.. భార‌త్‌..మేము వ‌చ్చేస్తున్నాం.. అంటూ ఆయ‌న ట్వీట్ చేశాడు. కాగా.. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ అభిమానుల‌ను ఎంతో ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని బాలీవుడ్ చిత్రనిర్మాత కరణ్ జోహార్, అపూర్వా మెహతా, ఛార్మి కలిసి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ముంబైలో జ‌రుగుతోంది.


Next Story