ఛార్మి సంచలన నిర్ణయం.. లైగ‌ర్ ఎఫెక్టేనా..!

Liger Producer Charmme takes a break from social media.ఛార్మి సోషల్ మీడియా నుంచి కాస్త విరామం తీసుకుంటున్నానని సంచలన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Sept 2022 12:44 PM IST
ఛార్మి సంచలన నిర్ణయం.. లైగ‌ర్ ఎఫెక్టేనా..!

టాలీవుడ్‌లో అన‌తి కాలంలోనే హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఛార్మి. అవ‌కాశాలు త‌గ్గుముఖం ప‌ట్టగానే నిర్మాత‌గా మారింది. స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో కలిసి సినిమాల‌ను నిర్మిస్తోంది. ఇక సోష‌ల్ మీడియాలో ఛార్మి ఎంత యాక్టివ్‌గా ఉంటారో అంద‌రికి తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ఇవ్వడంతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానుల‌తో పంచుకునేది. అయితే.. ఛార్మి సోషల్ మీడియా నుంచి కాస్త విరామం తీసుకుంటున్నానని సంచలన ప్రకటన చేశారు. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ ఆమె ఈ ఉద‌యం ట్వీట్ చేసింది.

"కాస్త శాంతించండి అబ్బాయిలూ.. సోష‌ల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నా.. పూరీ క‌నెక్ట్స్ సంస్థ మ‌రింత ధృఢంగా, ఉన్నతంగా సిద్ద‌మై త్వ‌ర‌లోనే మ‌ళ్లీ తిరిగి వ‌స్తుంద‌ని" ట్వీట్ చేసింది ఛార్మి.

విజయ్ దేవ‌ర‌కొండ హీరోగా పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో బిగ్గెస్ట్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్‌గా తెర‌కెక్కిన చిత్రం 'లైగ‌ర్‌'. ప్ర‌ముఖ బాక్స‌ర్ మైక్ టైస‌న్ న‌టించిన ఈ చిత్రాన్ని రూ.100 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో నిర్మించారు. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌లేక‌పోయింది. తొలి షో నుంచే నెగెటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి ఛార్మి స‌హ నిర్మాత అన్న సంగ‌తి తెలిసిందే.

'లైగ‌ర్ 'ఘోర ప‌రాభ‌వంతో విజ‌య్‌తో పాటు చిత్ర‌బృందాన్ని విమ‌ర్శిస్తూ ప‌లువురు సోష‌ల్ మీడియా వేదిక‌గా నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిత్రం అస్స‌లు బాలేదు. క‌థ‌,క‌థ‌నంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తూ.. ఛార్మి, పూరీ క‌నెక్ట్స్‌ని ట్యాగ్ చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఛార్మి సోష‌ల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది.

Next Story