విజ‌య్ దేవ‌ర‌కొండ అభిమానుల‌కు నిరాశ‌

Liger Movie teaser postponed.యంగ్ సెన్సేష‌న‌ల్‌ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ అభిమానుల‌కు నిరాశే ఎదురైంది.లైగ‌ర్‌ టీజ‌ర్ విడుద‌ల‌ను వాయిదా వేస్తున్న‌ట్లు వెల్ల‌డించింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 May 2021 11:47 AM IST
liger

యంగ్ సెన్సేష‌న‌ల్‌ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ అభిమానుల‌కు నిరాశే ఎదురైంది. విజ‌య్ దేవ‌ర‌కొండ నటిస్తున్న తాజా చిత్రం లైగ‌ర్‌. సాలా క్రాస్ బ్రీడ్ అనేది ట్యాగ్‌లైన్‌. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో విజ‌య్ స‌ర‌స‌న అన‌న్య పాండే క‌థానాయిక‌గా న‌టిస్తోంది. నేడు విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా ఈ చిత్రం నుంచి టీజ‌ర్ విడుద‌ల అవుతుంద‌ని అంతా బావించారు. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ఓ పోస్ట్ పెట్టింది. దేశంలో ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల‌ను దృష్టిలో పెట్టుకుని టీజ‌ర్ విడుద‌ల‌ను వాయిదా వేస్తున్న‌ట్లు వెల్ల‌డించింది.

'దేశంలో ఉన్న క్లిష్ట ప‌రిస్థితుల్లో మీరంతా ఇంట్లోనే సుర‌క్షితంగా ఉంటూ మీ ప్రియ‌మైన వారితో స‌మ‌యాన్ని గ‌డుపుతున్నార‌ని ఆశిస్తున్నాం. ప‌వ‌ర్ ప్యాక్డ్ అంశాల‌తో కూడిన లైగ‌ర్ టీజ‌ర్‌ని మే 9న విడుద‌ల చేయాల‌ని బావించాం. అయితే.. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా నెల‌కొని ఉన్న ఇబ్బందులు చూశాక‌.. టీజ‌ర్ విడుద‌ల వాయిదా వేయాల‌ని నిర్ణ‌యించుకున్నాం. త్వ‌ర‌లోనే మ‌రో కొత్త తేదీతో మీ ముందుకు వ‌స్తాం. చిత్రంలో విజ‌య్ దేవ‌ర‌కొండ గ‌తంలో ఎన్న‌డు క‌నిపించ‌ని లుక్‌లో మెరవ‌నున్నాడు. త‌ప్ప‌క అభిమానుల‌ని అల‌రిస్తాడు. ద‌య‌చేసి ఇంకొన్ని రోజులు ఇంట్లోని ఉండండి. శుభ్ర‌త పాటించండి. మీ వాళ్ల‌ని ఆరోగ్యంగా చూసుకొండి. త‌ప్ప‌క వ్యాక్సిన్ వేయించుకోండి. వైద్యులు చెబుతున్న సూచ‌న‌లు పాటిస్తూ అంద‌రు జాగ్ర‌త్త‌గా ఉండండి. ప‌రిస్థితులు అన్ని కుదుట‌పడ్డాక లైగర్ మిమ్మ‌ల్ని ఎంట‌ర్ టైన్ చేసేందుకు వ‌స్తాడ‌ని' ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్, పూరీ కనెక్ట్స్ ట్వీట్స్ చేశాయి.




Next Story