'లైగర్' మూవీ లాస్ట్ షెడ్యూల్ ప్రారంభం

Liger Movie Final schedule begins in Mumbai.యంగ్ హీరో విజ‌య‌దేవ‌ర‌కొండ న‌టిస్తున్న చిత్రం లైగ‌ర్‌. పూరీ జ‌గ‌న్నాథ్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Feb 2022 7:05 AM GMT
లైగర్ మూవీ లాస్ట్ షెడ్యూల్ ప్రారంభం

యంగ్ హీరో విజ‌య‌దేవ‌ర‌కొండ న‌టిస్తున్న చిత్రం 'లైగ‌ర్‌'. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో విజ‌య‌దేవ‌ర‌కొండ స‌ర‌స‌న అన‌న్య పాండే న‌టిస్తోంది. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈచిత్రంలో మైక్ టైసన్‌, బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. దాదాపు రూ.125 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఇప్ప‌టికే మైక్ టైస‌న్‌కు సంబంధించిన ఘాటింగ్ పార్ట్‌ను అమెరికాలో కంప్లీట్ చేసింది చిత్ర బృందం.

ఇక ఈ చిత్ర షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఈ విష‌యాన్ని చిత్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన చార్మి సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకుంది. చివ‌రి షెడ్యూల్‌కు సంబంధించిన సెట్‌లోని ఫోటోల‌ను పోస్ట్ చేసింది. ఈ షెడ్యూల్‌తో ఈ చిత్రానికి గుమ్మ‌డి కాయ కొట్టేయ‌నున్నారు. ఆగ‌స్టు 25న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే.. పూరీ కెరీర్‌లో ఓ సినిమా కోసం ఎక్కువ రోజులు పని చేయడం ఇదే తొలిసారి. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా చిత్ర షూటింగ్ చాలా ఆల‌స్యం అయింది.

Next Story
Share it