గుండెలోని ఆశలన్నీ ఎగిరాయి అంటున్న అఖిల్

Leharaayi Lyrical Song from Most Eligible Bachelor out.అఖిల్ అక్కినేని న‌టిస్తున్న తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 Sep 2021 7:51 AM GMT
గుండెలోని ఆశలన్నీ ఎగిరాయి అంటున్న అఖిల్

అఖిల్ అక్కినేని న‌టిస్తున్న తాజా చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో అఖిల్ స‌ర‌స‌న పూజా హెగ్డే జంటగా న‌టిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. బన్నీ వాసు, వాసు వర్మతో కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలు ఆకట్టుకున్నాయి.

తాజాగా ఈ చిత్రం నుంచి లెహరాయి అనే లిరిక‌ల్ పాట‌ను విడుద‌ల చేశారు. 'లెహరాయి లెహరాయి గుండెలోని ఆశలన్నీ ఎగిరాయి అంటూ రొమాంటిక్‌గా ఈ పాట సాగుతోంది. ఈ పాట‌ను సిద్ శ్రీరామ్ ఆల‌పించారు. ఇక ఈ చిత్రం అక్టోబ‌ర్ 8న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రంతో ఎలాగైనా మంచి విజ‌యాన్ని సొంతం చేసుకోవాల‌ని అఖిల్ కృత‌నిశ్చ‌యంతో ఉన్నాడు.

Next Story