ఆస్ప‌త్రిలో క‌ట్ట‌ప్ప‌.. ప‌రిస్థితి విష‌మం..?

Legendary Actor Sathyaraj hospitalized suddenly.సినీ ప‌రిశ్ర‌మ‌లో క‌రోనా క‌ల‌క‌లం రేపుతోంది. టాలీవుడ్‌, బాలీవుడ్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Jan 2022 8:44 AM IST
ఆస్ప‌త్రిలో క‌ట్ట‌ప్ప‌.. ప‌రిస్థితి విష‌మం..?

సినీ ప‌రిశ్ర‌మ‌లో క‌రోనా క‌ల‌క‌లం రేపుతోంది. టాలీవుడ్‌, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా సినీ రంగానికి చెందిన న‌టులు క‌రోనా బారిన ప‌డుతున్నారు. ఇప్ప‌టికే టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, మంచు ల‌క్ష్మీ, మంచు మ‌నోజ్‌, త‌మ‌న్‌, కోలీవుడ్‌కు చెందిన చియాన్ విక్ర‌మ్‌, అర్జున్‌, వ‌డిపోలు, వ‌రలక్ష్మీ శరత్ కుమార్ వంటి వారు క‌రోనా వైర‌స్ బారిన ప‌డగా.. తాజాగా బాహుబ‌లి న‌టుడు, తమిళ సీనియర్ నటుడు సత్యరాజ్ కు క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయ్యింది.

ఇటీవల క‌రోనా పరీక్షలు చేయించుకోగా స‌త్య‌రాజ్‌కు క‌రోనా పాజిటివ్ గా వ‌చ్చింది. దీంతో ఆయన అప్పటి నుంచి ఒంటరిగా సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారు. అయితే.. గత రాత్రి సత్యరాజ్ పరిస్థితి విషమంగా మారడంతో వెంటనే ఆయ‌న్ను చెన్నైలోని అమింజిక్కరైలోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం ఆయ‌న ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న ఆరోగ్యంపై అప్‌డేట్ రావాల్సి ఉంది.

త్రిష‌కు క‌రోనా..

హీరోయిన్ త్రిష కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశారు. ' కరోనా నియమాలు పాటిస్తున్నా.. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొత్త ఏడాదికి కొంచెం ముందు నాకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. మీకు తెలిసిన అన్ని లక్షణాలు నాకు ఉన్నాయి. అయినా కానీ ఆ వారాలు నాకు చాలా బాధ కలిగించాయి. ప్రస్తుతానికి నేను కోలుకొంటున్నాను. వాక్సినేషన్ వలన ఈరోజు నేను బావున్నాను. దయచేసి అందరు వాక్సిన్ వేయించుకొని.. మాస్క్ వేసుకోండి. త్వరలోనే మళ్లీ టెస్టులు చేయించుకొని ఇంటికి తిరిగి వస్తాను. నా కోసం ప్రార్దించిన నా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు' అంటూ త్రిష ట్వీట్ చేసింది.

Next Story