సింగ‌ర్ ల‌తా మంగేష్క‌ర్ ఆరోగ్య ప‌రిస్థితి విషమం.. ఆందోళ‌న‌లో అభిమానులు

Lata Mangeshkar Put On Ventilator Again As Her Health Deteriorates.ప్ర‌ముఖ గాయ‌ని ల‌తా మంగేష్క‌ర్ ఆరోగ్యం మ‌రింత

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Feb 2022 2:41 PM IST
సింగ‌ర్ ల‌తా మంగేష్క‌ర్ ఆరోగ్య ప‌రిస్థితి విషమం.. ఆందోళ‌న‌లో అభిమానులు

ప్ర‌ముఖ గాయ‌ని ల‌తా మంగేష్క‌ర్ ఆరోగ్యం మ‌రింత క్షీణించింది. ఆమె ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్ప‌త్రి వైద్యులు ప్ర‌తీత్ స‌మ‌దాని ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ప్ర‌స్తుతం ఆమెకు వెంటిలేట‌ర్‌పై వైద్యాన్ని అందిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. 'ల‌తా మంగేష్క‌ర్ ఆరోగ్య ప‌రిస్థితి మ‌ళ్లీ విష‌మించింది. ఐసీయూలో వెంటిలేట‌ర్‌పై చికిత్స అందిస్తున్నాం' అని తెలిపారు.

92 ఏళ్ల లతా మంగేష్కర్.. జ‌న‌వ‌రి 8న కొవిడ్ ల‌క్ష‌ణాల‌తో బ్రీచ్ క్యాండీ ఆస్ప‌త్రిలో చేరారు. క‌రోనా ద్వారా న్యూమోనియా కూడా అటాక్ అయింది. అయితే.. గ‌త‌నెల చివ‌రిలో ల‌త ఆరోగ్యం మెరుగుప‌డుతోంద‌ని మ‌హారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి చెప్పారు. క‌రోనా, న్యూమోనియా నుంచి కోలుకున్న‌ట్లు వెల్ల‌డిచారు. అయితే.. మ‌రో సారి ఆమె ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించింద‌ని వైద్యులు చెప్ప‌డంతో.. ఆమె అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు. ల‌తా జీ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థ‌న‌లు చేస్తున్నారు.

13 ఏళ్ల వ‌య‌స్సులో ల‌తా మంగేష్క‌ర్ త‌న కెరీర్‌ను ప్రారంభించారు. ఏడు ద‌శాబ్దాల కెరీర్‌లో 50 వేల‌కు పైగా పాట‌లు పాడారు. గాన కోకిలగా పేరు పొందారు. 2001వ సంవత్సరంలోనే భారత అత్యున్నత పురస్కారమైన భారత రత్న పుర‌స్కారం ద‌క్కింది. వేల పాట‌లు పాడిన ల‌తా మంగేష్క‌ర్‌ను నైటింగ‌ల్ ఆఫ్ ఇండియాగా కీర్తిస్తుంటారు.

Next Story