బంగార్రాజు.. 'లడ్డుందా' రిలికల్ పాట విడుదల
Laddunda Lyrical song from Bangarraju movie out.అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం బంగార్రాజు. సోగ్గాడే చిన్ని
By తోట వంశీ కుమార్ Published on 9 Nov 2021 5:06 AM GMT
అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం 'బంగార్రాజు'. 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రానికి ఫ్రీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున తనయుడు హీరో నాగచైతన్య కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. నాగ్ సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా.. చైతు సరసన కృతి శెట్టి నటిస్తోంది. జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
తాజాగా ఈ చిత్రం నుంచి 'లడ్డుండా' అనే రిలికల్ పాటను విడుదల చేశారు. అనూప్ రూబెన్స్ స్వరపరచిన ఈ పాట అభిమానులను అలరిస్తోంది. ధనుంజయ, మోహన భోగరాజు, హరిప్రియ, నూతన్ మోహన్ ఈ పాటను ఆలపించారు. 'బాబూ.. తబలా.. అబ్బాయ్ ఆర్మనీ.. చెరుకు తోటలో చారెడు బియ్యం.. వంగ తోటలో మరదలి కయ్యం.. లగెత్తి కొడితే లడ్డుండా.. లడ్డుండా' అంటూ పాటకు ముందు వచ్చే సాకీకి నాగార్జున గళం తోడు కావడంతో పాట అదిరిపోయింది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చిత్ర బృందం బావిస్తోంది.