సరికొత్త రికార్డు సృష్టించిన కుర్చీ మడతపెట్టి సాంగ్

‘సూపర్ స్టార్’ మహేష్ బాబు- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లోవచ్చిన చిత్రం గుంటూరు కారం (2024). ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది

By Medi Samrat  Published on  20 April 2024 9:15 PM IST
సరికొత్త రికార్డు సృష్టించిన కుర్చీ మడతపెట్టి సాంగ్

‘సూపర్ స్టార్’ మహేష్ బాబు- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లోవచ్చిన చిత్రం గుంటూరు కారం (2024). ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా.. రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి అభిమానులు, ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభించింది. అయితే ఓటీటీలోనూ.. టీవీలోనూ ఈ సినిమా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ను అందుకుంది.


ఈ సినిమాలోని పాటలకు మొదట మిశ్రమ స్పందన వచ్చింది. కొందరు ఇవేమి పాటలు అంటూ విమర్శలు గుప్పించారు. అయితే ఒక ట్రాక్ మాత్రం భాషతో సంబంధం లేకుండా బాగా పాపులారిటీని సొంతం చేసుకుంది. కుర్చీ మడతపెట్టి పాట మంచి మాస్ బీట్ గా పాపులారిటీని సొంతం చేసుకుంది.ఈ పాటలో మహేష్‌ బాబును ‘ఊర మాస్’ అవతార్‌లో చూడొచ్చు. డ్యాన్స్ కూడా మహేష్ బాబు అద్భుతంగా వేశాడు. ఈ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో కొద్దికాలంలోనే భారీ వ్యూస్ ను పొందింది. పుష్ప: ది రైజ్ (2021)లోని ‘ఊ అంటావా’ తర్వాత 200 మిలియన్ల వ్యూస్ మార్క్‌ను సాధించిన 2వ వేగవంతమైన తెలుగు పాటగా నిలిచింది. కుర్చీ మడతపెట్టి 78 రోజుల వ్యవధిలో ఈ మైలురాయిని సాధించింది. రాబోయే రోజుల్లో ఈ పాట మరిన్ని మెయిల్ స్టోన్స్ ను సాధించింది.

Next Story