బాలీవుడ్‌లో కొత్త ట్రెండ్.. ముందు ప్రెగ్నెంట్ అయ్యాక తర్వాత పెళ్లి: కమాల్ ఆర్ ఖాన్

KRK Faces Backlash For His 'Newlywed Actress Got Pregnant' Remark. బాలీవుడ్ క్రిటిక్, నటుడు కమాల్ ఆర్ ఖాన్(KRK) ఎప్పుడు చూసినా ఏదో ఒక విధంగా తన

By M.S.R  Published on  13 Feb 2023 6:48 PM IST
బాలీవుడ్‌లో కొత్త ట్రెండ్.. ముందు ప్రెగ్నెంట్ అయ్యాక తర్వాత పెళ్లి: కమాల్ ఆర్ ఖాన్

బాలీవుడ్ క్రిటిక్, నటుడు కమాల్ ఆర్ ఖాన్(KRK) ఎప్పుడు చూసినా ఏదో ఒక విధంగా తన వాయిస్ ను వినిపిస్తూనే వస్తుంటాడు. ముఖ్యంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. అభిమానులతో తిట్లు తినడం సర్వ సాధారణమైన విషయం అతడికి. ఇటీవల బాలీవుడ్ లవ్ బర్డ్స్ సిద్దార్థ్ మల్హోత్రా- కియారా అద్వానీ వివాహం చేసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. గత రాత్రి వీరి రిసెప్షన్ ముంబైలో గ్రాండ్ గా జరిగింది.

సినీ ప్రముఖులతో పాటు అభిమానులు కూడా వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బాలీవుడ్ క్రిటిక్ కమాల్ ఆర్ ఖాన్ ఓ హీరోయిన్ ఇటీవల పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ అంటూ వ్యాఖ్యలు చేశాడు. "ప్రస్తుతం బాలీవుడ్ లో కొత్త ట్రెండ్ నడుస్తోంది.. ముందు ప్రెగ్నెంట్ అయ్యాక పెళ్లి చేసుకుంటున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఇటీవల పెళ్లి చేసుకున్న బాలీవుడ్ జంట కూడా ఇదే ట్రెండ్ ను ఫాలో అయ్యారు” అంటూ ట్వీట్ చేశాడు. ఇది కావాలనే సిద్-కియారాను టార్గెట్ చేసి చేసిన వ్యాఖ్యలు అని అంటున్నారు. కమాల్ ఆర్ ఖాన్ కు ఎప్పుడు చూసినా వేరే వాళ్ళను చూసి ఆడిపోసుకోవడం తప్ప మరేమీ ఉండదని పలువురు విమర్శిస్తూ ఉన్నారు.


Next Story