ఆదిపురుష్‌పై వస్తున్న విమ‌ర్శ‌ల‌పై స్పందించిన కృతి సనన్

Kriti Sanon on Adipurush backlash. ప్రభాస్ నటిస్తున్న సినిమా లైనప్ లలో 'ఆదిపురుష్' కూడా ఒకటి..!

By M.S.R
Published on : 19 Nov 2022 8:30 PM IST

ఆదిపురుష్‌పై వస్తున్న విమ‌ర్శ‌ల‌పై స్పందించిన కృతి సనన్

ప్రభాస్ నటిస్తున్న సినిమా లైనప్ లలో 'ఆదిపురుష్' కూడా ఒకటి..! అయితే ఈ సినిమా టీజర్ ను చూసిన అభిమానులు ఓ రేంజిలో విమర్శలు గుప్పించారు. దీంతో సినిమా పోస్ట్ పోన్ చేసుకోలేక తప్పలేదు. ఈ సినిమాలో సీత పాత్రలో కృతి సనన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ఈ సినిమా గురించి స్పందించింది. వరుణ్ ధావన్‌తో కలిసి నటించిన భేడియా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్ కు వచ్చిన కృతి మాట్లాడుతూ.. టీజర్ నిడివి చాలా చిన్నదని.. కేవలం దాన్ని చూసి సినిమాని ఎలా జడ్జ్ చేస్తారని బదులిచ్చింది. ఆదిపురుష్ సినిమా పట్ల తమకు చాలా గర్వంగా ఉందని, ఇది మన చరిత్రలో భాగమని తెలిపింది. ఇదొక గొప్ప సినిమా అని, మనమంతా గర్వించదగ్గ కథ అని.. ఈ సినిమాను సాధ్యమైనంత ఉత్తమంగా అందించేందుకు దర్శకుడు ఓమ్ రౌత్ కష్టపడుతున్నారని తెలిపింది.ఈ సినిమాపై మరింత పని చేయాల్సిన అవసరం ఉందని, అందుకు సమయం పడుతుందని కృతి సనన్ చెప్పుకొచ్చింది. ఆదిపురుష్ సినిమాను తొలుత సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. కానీ ఈ సినిమాను జూన్ 16కి వాయిదా వేశారు.


Next Story