ఆదిపురుష్.. సీతాదేవికి శ్రీరాముని ఆత్మీయ స్వాగతం

Kriti Sanon Joins Adipurush.సీత పాత్ర‌కు కృతి స‌న‌న్ పేరును వెల్లడించిన ప్రభాస్.. ఆమెకు వెల్‌కమ్ చెబుతూ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 March 2021 1:25 PM IST
Kriti Sanon Joins Adipurush

యంగ్ రెబ‌ల్ స్టార్ న‌టిస్తున్న తాజా చిత్రం 'ఆదిపురుష్‌'. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ ముంబైలో శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది. ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వ‌చ్చేసింది. యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్ రాముడిగా న‌టిస్తుంటే.. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ రావ‌ణాసురుడుగా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక సీత పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తారు అనే దానిపై చాలా పేర్లే వినిపించాయి. తాజాగా చిత్ర బృందం పుల్ క్లారిటీ ఇచ్చేసింది. సీత పాత్ర‌కు కృతి స‌న‌న్ పేరును వెల్లడించిన ప్రభాస్.. ఆమెకు వెల్‌కమ్ చెబుతూ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టారు.


అందులో ప్ర‌భాస్‌, కృతిస‌న‌న్‌, స‌న్నీసింగ్ సాంప్ర‌దాయ దుస్తుల్లో మెరిసిపోతూ క‌నిపించారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఇన్నాళ్లకు సీత పాత్రధారి పై సస్పెన్స్ వైదొలగింది. అనుష్క శర్మ, అనుష్క శెట్టి, కీర్తి సురేష్, కియారా అద్వానీ తదితర భామల పేర్లు గత కొద్దిరోజులుగా తెరపైకి వచ్చాయి. కానీ వీళ్లలో ఎవరూ ఎంపిక కాలేదు. జాబితాలో అందరినీ వెనక్కి నెట్టేసి కృతి సనోన్ చోటు దక్కించుకోవడం ఆసక్తికరం. ఇక లక్ష్మణుడి పాత్రను బాలీవుడ్ హీరో సన్నీ సింగ్‌ను తీసుకున్నట్లు వెల్లడించారు. పాన్ ఇండియన్ చిత్రంగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమా.. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు. టీ సిరీస్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వ‌చ్చే ఏడాది ఆగ‌స్ట్ 11న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది ఈ చిత్రం.


Next Story