ప్ర‌భాస్‌తో ప్రేమ‌.. స్పందించిన కృతిస‌న‌న్‌.. ఏమ‌ని చెప్పిందంటే..?

Kriti Sanon denies rumours about her and Prabhas.కృతి స‌న‌న్‌, ప్ర‌భాస్ లు ప్రేమించుకుంటున్నారంటూ గ‌త కొద్ది రోజులుగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Nov 2022 6:46 AM
ప్ర‌భాస్‌తో ప్రేమ‌.. స్పందించిన కృతిస‌న‌న్‌.. ఏమ‌ని చెప్పిందంటే..?

బాలీవుడ్ బ్యూటీ కృతి స‌న‌న్‌, డార్లింగ్ ప్ర‌భాస్ లు ప్రేమించుకుంటున్నారంటూ గ‌త కొద్ది రోజులుగా సోష‌ల్ మీడియాలో వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. బాలీవుడ్ న‌టుడు వ‌రుణ్ ధావ‌న్ చేసిన వ్యాఖ్య‌లు ఈ వార్త‌ల‌కు బ‌లం చేకూర్చిన‌ట్లైంది. ఈ క్ర‌మంలో ఈ వార్త‌ల‌పై ఎట్ట‌కేల‌కు కృతి స‌న‌న్ స్పందించింది. అవ‌న్నీ నిజం కావ‌ని కొట్టిపారేసింది. వ‌రుణ్ ధావ‌న్ స‌ర‌దాగా అన్న మాట‌లు ఇప్పుడు ఎన్నో వార్త‌ల‌కు నాంది ప‌లికిన‌ట్లు అయ్యింది. కొన్ని వెబ్‌సైట్లు వివాహ తేదీని ప్ర‌క‌టించ‌డానికి ముందే వీటికి పుల్ స్టాప్ పెట్టాల‌ని బావిస్తున్న‌ట్లు కృతి చెప్పుకొచ్చింది.

"ఇది ప్రేమ కాదు. ప్ర‌చారం కాదు. మ‌న భేదియా(వ‌రుణ్ ధావ‌న్‌) ఆ రియాలిటీ షోలో పాల్గొన‌ప్పుడు కాస్త అత్యుత్యాహం క‌న‌బ‌రిచాడు. అత‌డు స‌ర‌దాగా అన్న మాట‌ల వ‌ల్ల ఎన్నో వార్త‌లు పుట్టుకొస్తున్నాయి. కొన్ని వెబ్‌సైట్లు నా పెళ్లి తేదీని ప్ర‌క‌టించ‌డానికి ముందే వాటిని నేను పుల్‌స్టాఫ్ పెడుతున్నా. వాటిల్లో ఎలాంటి నిజం లేదు. "అని కృతి స‌న‌న్ త‌న ఇన్‌స్టా రీల్స్‌లో రాసుకొచ్చింది.


'బేధియా' సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా కృతిస‌న‌న్‌, వ‌రుణ్ ధావ‌న్‌లు క‌లిసి ఓ రియాలిటీ షోలో పాల్గొన్నారు. ఆ షోలో వ‌రుణ్ మాట్లాడుతూ.. కృతిస‌న‌న్ మ‌న‌స్సు ఇక్క‌డ లేదు. ఆమె మ‌న‌స్సు దీపికా ప‌దుకొనేతో న‌టిస్తున్న ఓ న‌టుడి వ‌ద్ద ఉంది. అంటూ అత‌డు చేసిన వ్యాఖ్య‌లతో ర‌చ్చ మొద‌లైంది. తాజాగా దీనిపై కృతిస‌న‌న్ క్లారిటీ ఇచ్చింది.

Next Story