'మురారి' సినిమా థియేటర్లలో చేసిన అతిపై కృష్ణ వంశీ స్పందన ఇదే!!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన మురారి సినిమా 4కేలో ఇటీవల రీ రిలీజ్ అయింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 Aug 2024 4:15 PM GMT
Krishnavamsi, Couple Wedding, Murari Re Release, Theater

'మురారి' సినిమా థియేటర్లలో చేసిన అతిపై కృష్ణ వంశీ స్పందన ఇదే!! 

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన మురారి సినిమా 4కేలో ఇటీవల రీ రిలీజ్ అయింది. 2001 లో వచ్చిన మురారి అప్పట్లో హిట్ అవ్వగా.. రీరిలీజ్ లో కూడా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. అభిమానులు థియేటర్లలో చేసిన రచ్చతో సోషల్ మీడియా నిండిపోయింది. అయితే కొందరు ఏకంగా తాళి కట్టడం, అక్షింతలు చల్లడం వంటివి థియేటర్లలో చేశారు. కొన్ని నవ్వు తెప్పించే విధంగా ఉన్నా.. మరికొన్ని హిందూ సంప్రదాయం లోని పెళ్లిని అపహాస్యం చేసినట్లే అవుతుందని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనిపై దిగ్గజ దర్శకుడు కృష్ణ వంశీ స్పందించారు.

థియేటర్లలో పెళ్లిళ్లు చేసుకున్న వీడియోను చూసి కృష్ణవంశీ ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా హాళ్లలో పెళ్లిళ్లు చేసుకుని మన సంస్కృతిని అవమానించవద్దని.. తెలిసీ తెలియక వాళ్లు అలా చేసి ఉంటారని భావిస్తున్నానన్నారు. పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నట్టు చెబుతూ సోషల్ మీడియాలో తెలిపారు. మురారి సినిమాలో ‘అలనాటి రామచంద్రుడు..’ పాట వస్తున్న సమయంలో చాలా థియేటర్లలో పెళ్లిళ్లు చేసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Next Story