ఆస్ప‌త్రిలో రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు..!

Krishnam Raju admitted in Hospital.హీరో సాయిధ‌ర‌మ్‌తేజ్ రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డి అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Sept 2021 1:37 PM IST
ఆస్ప‌త్రిలో రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు..!

హీరో సాయిధ‌ర‌మ్‌తేజ్ రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డి అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. అయితే.. తాజాగా రెబ‌ల్ స్టార్ కృష్ణం రాజుకి ప్ర‌మాదం జ‌రిగింద‌ని ఆస్ప‌త్రిలో అడ్మిట్ అయ్యార‌నే వార్త‌లు వినిపిస్తుండ‌డంతో ఆయ‌న అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు. కృష్ణం రాజు ఇంట్లో ప్ర‌మాద వ‌శాత్తు కాలుజారీ కింద‌ప‌డ్డార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో కుటుంబ స‌భ్యులు ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు. కృష్ణంరాజు ఆరోగ్యం బాగానే ఉంద‌ని తెలిపారు.

త్వ‌ర‌లో కృష్ణం రాజు యూకే ప‌ర్య‌ట‌న‌కు వెలుతున్నార‌ని.. ఈ నేప‌థ్యంలో కేవ‌లం రెగ్యుల‌ర్ హెల్త్ చెక‌ప్ కోసం అపోలో ఆస్ప‌త్రికి వ‌చ్చిన‌ట్లు కృష్ణంరాజు కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన సాయిధ‌ర‌మ్ తేజ్ ఆరోగ్య ప‌రిస్థ‌తిని కూడా కృష్ణంరాజు తెలుసుకున్నార‌ని, ఆయ‌న త్వ‌రగా కోలుకోవాల‌ని కృష్ణంరాజు ఆకాంక్షించార‌ని చెప్పారు.

Next Story