నాగశౌర్య పుట్టిన రోజు స‌ర్‌ప్రైజ్‌ 'కృష్ణ వ్రింద విహారి'

Krishna Vrinda Vihari Movie first look.విభిన్నమైన చిత్రాలను చేస్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్న న‌టుడు నాగ‌శౌర్య‌.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Jan 2022 7:30 AM GMT
నాగశౌర్య పుట్టిన రోజు స‌ర్‌ప్రైజ్‌ కృష్ణ వ్రింద విహారి

విభిన్నమైన చిత్రాలను చేస్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్న న‌టుడు నాగ‌శౌర్య‌. `వరుడు కావలెను` అంటూ కొత్త తరహా చిత్రంతో ప్రేక్షకులని ఆకట్టుకున్న నాగశౌర్య తాజాగా మ‌రో సరికొత్త చిత్రంతో అల‌రించేందుకు సిద్దం అయ్యాడు. అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రంలో ఆయ‌న న‌టిస్తున్నాడు. ఈ చిత్రాన్ని నాగ‌శౌర్య సొంత బ్యాన‌ర్ ఐరా క్రియేష‌న్స్‌లో తెర‌కెక్కుతుండ‌గా.. ఉమ మూల్పూరి నిర్మిస్తున్నారు.

కాగా.. నేడు నాగ‌శౌర్య పుట్టిన రోజు సంద‌ర్భంగా కొత్త సినిమా టైటిల్ తో పాటు ఫ‌స్టులుక్‌ను విడుద‌ల చేశారు. ఈ చిత్రానికి 'కృష్ణ వ్రింద విహారీ' అనే టైటిల్‌ను పెట్టారు. కృష్ణ, వ్రింద, విహారి అనే ముగ్గురి మధ్య సాగే ప్రణయ ప్రయాణమే ఈ సినిమా అని టైటిల్‌ను బ‌ట్టి అర్థం అవుతోంది. ఈ చిత్రంతో షిర్లే సేతియా కథానాయికగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో నుదిటిన నిలువుతా తిలకం దిద్దుకుని చేతికి తాడు కట్టుకుని మెడలో డాలర్ వేసుకుని చేతిలో రాగి చెంబుతో నీళ్లు చల్లుతూ హీరో నాగశౌర్య బ్రాహ్మణ యువకుడిగా కనిపిస్తున్న తీరు ఆకట్టుకుంటోంది. మహతి స్వరసాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తుండ‌గా..సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ కీలకపాత్రలో నటిస్తున్నారు.

Next Story
Share it