అయ్యో.. ఈమె కోవై స‌ర‌ళ నా.. ఇలా అయిపోయింది ఏంటీ.. ఫోటో వైర‌ల్‌

Kovai Sarala's Shocking Look From Sembi.కోవై సరళ.. టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. త‌న‌దైన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 May 2022 5:31 AM GMT
అయ్యో.. ఈమె కోవై స‌ర‌ళ నా.. ఇలా అయిపోయింది ఏంటీ.. ఫోటో వైర‌ల్‌

కోవై సరళ.. టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. త‌న‌దైన కామెడీతో న‌వ్వులు పూయించే ఆమె లేడి క‌మెడియ‌న్‌గా మంచి పేరు తెచ్చుకుంది. తెలుగులో ఎన్నో చిత్రాల్లో న‌టించిన కోవై స‌ర‌ళ‌.. గ‌త కొంత‌కాలంగా సినిమాల్లో క‌నిపించ‌డం లేదు. 2019లో వ‌చ్చిన 'అభినేత్రి 2' చిత్రంలో చివ‌రి సారిగా క‌నిపించింది. అయితే.. ఆమె న‌టించ‌డం మానేసిందా అని అనుకుంటుండ‌గా.. షాకింగ్ లుక్‌లో క‌నిపించి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఆమె పూర్తిగా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ప్ర‌స్తుతం ఈ షాకింగ్ లుక్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

వివ‌రాల్లోకి వెళితే.. ప్ర‌భు సాల్మ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో 'సెంబీ' అనే త‌మిళ చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలో కోవై స‌ర‌ళ 70 ఏళ్ల వృద్ధురాలి పాత్ర‌లో న‌టిస్తోంది. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రంలోంచి కోవై స‌ర‌ళ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. త‌ల‌కు క్లాత్ క‌ట్టుకుని ఓ చిన్నారిని ప‌ట్టుకుని క‌నిపిస్తోంది. ఇక ఈ చిత్రం ఓ బ‌స్సు జ‌ర్నీ నేప‌థ్యంలో సాగుతుంద‌ని తెలుస్తోంది. ఇందులో కోవై సరళ సీరియస్ పాత్రలో నటిస్తోంది. తంబి రామ‌య్య, బాల‌న‌టి నీలా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. తెలుగు,త‌మిళ‌,క‌న్న‌డ బాష‌ల్లో ఈ చిత్రం విడుద‌ల కానుంది.

Next Story
Share it